Free Surgeries: రూ.లక్షల్లో ఖర్చు అయ్యే ఆపరేషన్లు ఇక్కడ ఉచితంగానే చేస్తారు..

కంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఓ మంచి సమాచారాన్ని డాక్టర్ ఐ. శాలిని ప్రజలకు అందించారు. గత పదేళ్లకు పైగా అనుభవం కలిగిన ఆమె, తమ హాస్పిటల్‌లో పిల్లల కంటి ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు.
18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు కంటి సమస్యలు వస్తే పూర్తి ఉచితంగా ఎటువంటి ఛార్జ్ లేకుండా కంటి చికిత్సలు అందిస్తున్నారు. ఎక్కడంటే చిత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డి ఏ ఐ సి భవనంలో ఈ చికిత్సలు అందిస్తున్నారు. నవజాత శిశువులో వచ్చే మెల్లకన్ను, పొరలు ఇలా అనేక రకాల సమస్యలకు ఉచితంగా ఆపరేషన్ చేసి వారి నివాసాలకు ఉచిత వాహన సేవా కార్యక్రమం కూడా అందిస్తున్నారు.
సుమారు 10 సంవత్సరాలకు పైచిలుకు అనుభవం గల డాక్టర్ ఐ. శాలిని లోకల్ 18 ద్వారా చక్కటి సందేశం ఇచ్చారు. మీ చుట్టుపక్కల చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతుంటే మా హాస్పిటల్‌ను సందర్శించి మా సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఇలాంటి చికిత్సలు బయట ప్రైవేటు హాస్పిటల్‌లో చేసుకోవాలంటే లక్షల్లో డబ్బులు ఖర్చవుతుంది. కానీ మన దగ్గర అన్ని చికిత్సలు ఉచితమే. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: SBI RSETI Free Training: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు ఈజీగా లోన్ ఇస్తారు.. ఉచిత శిక్షణ + వసతి + భోజనం సదుపాయాలతో..
ఒకప్పుడు కంటి సమస్యలు వృద్ధుల్లో మాత్రమే చూసేవాళ్ళం. త్వరగా నయం కావాలనే ఉద్దేశంతో ప్రైవేటు వైద్యం ఆశించేవారు. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి నయం చేసుకునేవారు. ఆర్థిక స్థోమత లేని వారు ప్రభుత్వ వైద్యాన్ని ఆశించేవారు. నిదానంగా నయం చేసుకునేవారు. వీరికి లోపం వచ్చినా తట్టుకొని, అన్ని సమకూర్చుకొని చేసుకుంటారు. కానీ అభం శుభం తెలియని చిన్నారులకు, ఊహ తెలియని చిన్నారులకు సమస్య వస్తే కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి వారికి గత 10 సంవత్సరాలుగా చిత్తూరు సత్వర చికిత్స కేంద్రంలో వైద్యంలో అనుభవజ్ఞులైన వారి నేతృత్వంలో చికిత్సలు, ఆపరేషన్స్ చేస్తున్నారు.మరింత మెరుగ్గా సేవలు ముమ్మరం చేసే దిశగా కొత్తగా డి ఏ ఐ సి భవనం నిర్మించారు. ఇందులో దాదాపుగా 10 సంవత్సరాలు అనుభవం గల డాక్టర్ శాలిని ఈ కంటి చికిత్సలకు బాధ్యత వహిస్తున్నారు. ఈమె సలహాలు, సూచనలు ఆపరేషన్ చేసుకున్న చిన్నారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు అయితే మరింత ఆనందంగా ఉంటున్నారు.

