జె.ఎం.జె కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

రాష్ట్ర వార్త ఆరోగ్యం :
తెనాలి రాష్ట్రవార్త:స్థానిక జె.యం.జె మహిళా కళాశాలలోఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు.కంటి వైద్య నిపుణులు డాక్టర్లు గంజి స్వప్న, భాషా, ప్రసన్న కుమార్ లు విద్యార్థినిలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అని, కంటి పరీక్షలు చేయించుకోవడం, చిన్న వయసులోనే కంటి సమస్యలు గుర్తిస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చునని వైద్యులు సూచించారు. అవసరమైన విద్యార్థినులకు ప్రభుత్వం సహకారంతో ఉచిత కళ్లజోళ్లు అందజేయనున్నట్లు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ పి. శాంత మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం కూడా విద్యతో సమానంగా ముఖ్యమేనని,ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం అవుతాయని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి వాలంటీర్ల సేవను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సపోర్టింగ్ సిబ్బంది పి. కుమారి, ఆర్. మాధురి, బి. గంగాధర్, వి. నాగబాబు కార్యక్రమ సమన్వయ కమిటీ సభ్యులుడాక్టర్ పి. జెన్నమ్మ, అధ్యాపకులు, విద్యార్థి వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు.

