Free Darshanam: ఆధార్ ఉంటే వేగంగా ఉచితంగానే దర్శనం.. మీ ఫోన్లో నుంచే టికెట్ బుక్ చేసుకోండిలా!

ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఇకపై ఆన్లైన్ టోకెన్లతో మరింత సులభం. మీరు కూడా వివరాలు వెంటనే తెలుసుకోండి. ఈ నెల 1వ తేదీ నుండి శ్రీశైల దేవస్థానంలో మళ్ళీ ప్రారంభించిన ఉచిత స్పర్శ దర్శన సేవకు భక్తులు విస్తృతంగా స్పందిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం, మొదటి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సేవకు హాజరయ్యారని, వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నానని తెలిపారు. ఈ స్పర్శ దర్శనాన్ని ప్రతివారం మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు ఈవో వెల్లడించారు.
ఈ సేవను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. భక్తులు ముందుగానే టోకెన్ బుక్ చేసుకునే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నారు. రోజుకు గరిష్ఠంగా 1000 టోకెన్లు మాత్రమే జారీ చేస్తారు. [www.srisailadevasthanam.org](http://www.srisailadevasthanam.org) లేదా [www.aptemples.ap.gov.in](http://www.aptemples.ap.gov.in) వెబ్సైట్లలో ఈ టోకెన్లు లభిస్తాయి.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava List: అన్నదాత సుఖీభవపై కీలక ప్రకటన, రైతులకు భారీ శుభవార్త.. ఈ రోజు నుంచే..
ఉచిత స్పర్శ దర్శనం పొందాలనుకునే భక్తులు, తదుపరి రోజును దృష్టిలో ఉంచుకుని ఒక రోజు ముందు టోకెన్ బుక్ చేసుకోవాలి. ఉదాహరణకు మంగళవారం స్పర్శ దర్శనం కావాలంటే, సోమవారం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ బుకింగ్ సమయంలో భక్తుల పూర్తి వివరాలు – పేరు, చిరునామా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. భద్రతాపరంగా, టికెట్‌ను స్కాన్ చేసి, ఆధార్‌తో సరిపోల్చిన తరువాతే దర్శనానికి అనుమతిస్తారు.

