బాడీలోని ఫ్యాట్‌ని కరిగించే ఫుడ్స్, కోచ్ చెప్పే పదార్థాలతో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి బరువు ఇట్టే తగ్గుతారు …

బాడీలో ఫ్యాట్ పెరిగితే ఆటోమేటిగ్గా బరువు కూడా పెరుగుతారు. అందుకే, బరువు తగ్గాలనుకునేవారు ముందుగా బాడీలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. దీనికోసం ప్రోటీన్ ఫుడ్స్ ది బెస్ట్. మరి మన బాడీలోని ఫ్యాట్‌ని కరిగించి బరువు తగ్గించే ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా.బరువు, ఫ్యాట్ తగ్గడంలో సరైన డైట్ కీ రోల్ పోషిస్తుంది. మనం తీసుకునే సరైన ఫుడ్స్‌తోనే బరువుని, బాడీలోని కొలెస్ట్రాల్‌ని చక్కగా కరిగించుకోవచ్చు. అందుకోసం సరైన ఫుడ్స్ తీసుకోవాలి. డైట్ అనగానే చాలా మంది బాబోయ్ చాలా కష్టం ఎలా మెంటెయిన్ చేస్తాం. ప్రత్యేకంగా మనకోసం ప్రిపేర్ చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో అదెలా సాధ్యమనుకుంటారు. కానీ, అలా కాకుండా తక్కువ టైమ్‌లోనే తయారయ్యే ప్రోటీన్ రెసిపీన్‌ని సెలక్ట్ చేసుకుంటే చక్కగా కడుపు నిండుతుంది. నేచురల్‌గానే బరువు కూడా తగ్గుతారు. అందుకోసమే గట్ అండ్ వెయిట్‌లాస్ కోచ్ దీపికా రాంపాల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గురించి షేర్ చేసింది. వీటన్నింటిని కూడా మనం 20 నిమిషాల్లోపే తయారుచేసి తినొచ్చు. 5 రకాల ఈ ప్రోటీన్ ఫుడ్స్‌ని రోజుకోటి ట్రై చేసి హ్యాపీగా బరువు తగ్గొచ్చు. పైగా ఇవన్నీ కూడా వెజిటేరియన్స్ రకం. ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా చేసి ఎవరైనా తినొచ్చు.ప్రోటీన్ ఫుడ్ బాడీకి చాలా అవసరం. వీటిని తినడం వల్ల చాలా వరకూ కడుపు నిండుగా ఉంటుంది. పైగా బరువు కూడా తగ్గడంలో ఈ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. ప్రోటీన్ అనగానే నాన్‌వెజ్‌లోనే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయనుకుంటారు. కానీ, వెజిటేరియన్స్‌కి కూడా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా రుచిగా ఉండి బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా, ఇవి కండరాల బలానికి కూడా చాలా మంచిది. అలాంటి ప్రోటీన్ వెజిటేబుల్స్ ఏంటంటేఇది కూడా మంచి రెసిపీ. హల్లౌమి అనేది మనకి చూడ్డానికి పనీర్‌లా ఉండే పదార్థం. మార్కెట్‌లో దొరుకుతుంది. 100 గ్రాముల హల్లౌమిని పాన్‌పై గ్రిల్ చేసి, మసాలాలు, స్పైసీ పెప్పర్, కారాన్ని యాడ్ చేయండి. లెట్యూస్‌ని ముక్కలుగా కట్ చేయండి. ఈలోపు చిలగడదుంపని ఉడికించండి. సగం డబ్బా బ్లాక్ బీన్స్, సగం డబ్బా స్వీట్ కార్న్‌ని యాడ్ చేయండి. అంతే రెసీప రెడీ, నిమ్మ ముక్కతో గార్నిష్ చేయండి. దీనిని తింటే దాదాపు 34 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. బరువు, ఫ్యాట్‌ని కరిగించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. శనగల కూర కూడా మంచి ప్రోటీన్ రిచ్ సోర్స్ అని చెప్పొచ్చు. చక్కగా ఉడికించిన శనగల్ని మీకు నచ్చిన మసాలాలు, టమాటలు వేసి మరోసారి ఉడికించండి. ఇందులోనే 200 గ్రాముల గ్రీక్ యోగర్ట్ వేసి కలిపి దగ్గర పడనివ్వండి. ఈ కూరని చక్కగా పాపడ్‌తో కలిపి ఎంజాయ్ చేయండి. దీంతో మీకు మంచి రిచ్ ప్రోటీన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కూర తింటే మీకు 30 గ్రాముల ప్రోటీన్ అందుతుంది.

