స్త్రీ, పురుషుల్లో రీప్రొడక్టివ్ హెల్త్‌ను మెరుగు పర్చడంలో యాంటీ ఆక్సిడెంట్లు నైట్రేట్లు, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ C అండ్ మినరల్స్ వంటివి కీ రోల్ పోషిస్తాయి.
ప్రస్తుతం అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. ఇక పురుషుల్లో లో స్పెర్మ్ ఇష్యూస్, మహిళల్లో అండాలు సక్రమంగా రిలీజ్ కాకపోవడం వంటి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఇవి సంతానలేమికి దారితీస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడటంలో సప్లిమెంట్లకంటే సహజ సిద్ధమైన ఆహారాలే మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిలో గుమ్మడి గింజలు (Pumpkin Seeds), అరటిపండ్లు, బీట్‌రూట్, ముడి తేనె (raw honey) వంటివి కూడా ఉన్నాయి. సప్లిమెంట్లు లేకుండానే వీటి ద్వారా బలం, శక్తి, రక్తప్రసరణ, అలాగే రీ ప్రొడెక్టివ్ హెల్త్‌ను మెరుగుపరచవచ్చు. అదెలాగో చూద్దాం.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు (Pumpkin Seeds) అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, ఫోలేట్ వంటి మినరల్స్, అలాగే ఫైబర్ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందిస్తాయి. వీటిని నానబెట్టి లేదా రోస్ట్ చేసి కూడా తినవచ్చు. సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. స్మూతీలు లేదా గ్రానోలాలో కలిపి తీసుకోవచ్చు. లేదా స్నాక్‌గా రోజుకు 1-2 టేబుల్ స్పూన్లు కూడా తినవచ్చు. మొత్తానికి వీటిని ఆహారంగా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గుతుందని, హార్ట్ హెల్త్ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇమ్యూనిటీని పెంచడం, స్పెర్మ్ హెల్త్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్‌కు సపోర్ట్ చేయడం, అలసట తగ్గించడంలో కీ రోల్ పోషిస్తాయి.
అరటిపండ్లు
అరటిపండ్లు పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, ఫైబర్, అలాగే సహజ చక్కెరలు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందిస్తాయి. వీటిని పండ్లుగా తినవచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు కూరగానూ వండుకోవచ్చు. అలాగే స్మూతీలు, మిల్క్ షేక్స్‌లో కలిపి తాగవచ్చు. బేకింగ్‌లో ఉపయోగించవచ్చు. లేదా వర్కౌట్ ముందు ఎనర్జీ స్నాక్‌గా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే డైజెస్టివ్ హెల్త్‌ను మెరుగుపరచడం, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సమతుల్యం చేయడం, హార్ట్ హెల్త్ సపోర్ట్, బ్లడ్ ప్రెజర్ నియంత్రణ, వెయిట్ మేనేజ్‌మెంట్, ఇమ్యూనిటీ పెంచడం, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి.
బీట్‌రూట్
స్త్రీ, పురుషుల్లో రీప్రొడక్టివ్ హెల్త్‌ను మెరుగు పర్చడంలో బీట్‌రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు (బెటాలైన్స్), నైట్రేట్లు, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ C అండ్ మినరల్స్ (ఐరన్, మాంగనీస్) వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సలాడ్స్‌లో కలపడం ద్వారా, జ్యూస్ రూపంలో, రోస్ట్ లేదా బాయిల్ యడం ద్వారా ఉపయోగించవచ్చు. మల్టిపుల్ మీల్స్‌లో విభజించి తీసుకోవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ మెరుగుపరచడంలో, గుండె, అలాగే జీర్ణశయ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో బీట్ రూట్‌లోని పోషకాలు సహాయపడతాయి. రీ ప్రొడక్టివ్ హెల్త్‌ను మెరుగు పరుస్తాయి.
ముడి తేనె
ముడి తేనె (Raw Honey) యాంటీ ఆక్సిడెంట్లు, అమినో ఆసిడ్స్, విటమిన్ సి, బి, ఐరన్, జింక్ వంటి మినరల్స్, ఎంజైమ్స్ అండ్ సహజ చక్కెరలతో నిండి ఉంటుంది. రోజుకు 1-2 టీస్పూన్లు తేనెను టీ లేదా గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే కఫం, గొంతునొప్పి, గాయం మానడంలో, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండటంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో, ఇమ్యూనిటీని పంచడంలో, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో ముడితేనె అద్భుతంగా సహాయపడుతుంది.
