Food Storage: స్టీల్ డబ్బాల్లో ఈ 5 ఆహార పదార్థాలు అస్సలు నిల్వ చేయొద్దు.. హెల్త్‌కి డేంజర్

తక్కువ క్వాలిటీ స్టీల్‌తో కొన్ని ఫుడ్స్ రియాక్ట్ అయ్యి, వాటి టేస్ట్‌ను మార్చేస్తాయి. దీనివల్ల ఆహారం త్వరగా పాడవ్వడమే కాకుండా, కొన్నిసార్లు హెల్త్‌కు కూడా ప్రమాదం కావచ్చు. మన కిచెన్ (Kitchen)లో స్టీల్ డబ్బాల (Steel container) హవానే నడుస్తుంది. ఎందుకంటే అవి స్ట్రాంగ్‌గా ఉంటాయి, క్లీన్ చేయడం ఈజీ, పదేపదే వాడుకోవచ్చు. కానీ, కొన్ని రకాల ఫుడ్స్‌ను స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేయడం అస్సలు సేఫ్ కాదు. ముఖ్యంగా తక్కువ క్వాలిటీ స్టీల్‌తో కొన్ని ఫుడ్స్ రియాక్ట్ అయ్యి, వాటి టేస్ట్‌ను మార్చేస్తాయి.దీనివల్ల ఆహారం త్వరగా పాడవ్వడమే కాకుండా, కొన్నిసార్లు హెల్త్‌కు కూడా ప్రమాదం కావచ్చు. మీరు కూడా కింద చెప్పిన 5 పదార్థాలను స్టీల్ డబ్బాల్లో పెడుతున్నట్లయితే, వెంటనే ఆ అలవాటు మార్చుకోవడం మంచిది. ఎందుకో తెలుసుకుందాం.ఊరగాయలు
పచ్చళ్లలో వెనిగర్, ఉప్పు, యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని స్టీల్ డబ్బాల్లో నిల్వ చేసినప్పుడు, ఈ యాసిడ్స్ లోహంతో రియాక్ట్ అవుతాయి. దీనివల్ల ఊరగాయ టేస్ట్ మారిపోయి, ఒకరకమైన మెటల్ వాసన వస్తుంది. అంతేకాదు, పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండదు.కొన్నిసార్లు ఈ రియాక్షన్ వల్ల హానికరమైన పదార్థాలు కూడా ఊరగాయలో కలిసే ప్రమాదం ఉంది. అందుకే, ఊరగాయలను నిల్వ చేయడానికి గాజు సీసాలే (Glass jars) బెస్ట్ ఆప్షన్. గాజు యాసిడ్స్‌తో రియాక్ట్ అవ్వదు, కాబట్టి టేస్ట్, క్వాలిటీ చెక్కుచెదరకుండా ఉంటాయి.పెరుగు
పెరుగులో కొద్దిగా యాసిడ్ గుణం ఉంటుంది, మన డైజెషన్‌కు మేలు చేసే ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. పెరుగును తక్కువ క్వాలిటీ ఉండే స్టీల్ గిన్నెల్లో స్టోర్ చేసినప్పుడు, దానిలోని యాసిడ్ లోహంతో రియాక్ట్ అయ్యి, పెరుగు అసలు రుచిని పాడుచేస్తుంది.దీనివల్ల పెరుగు త్వరగా పులిసిపోతుంది. ఈ ప్రాసెస్‌లో పెరుగులో ఉండే హెల్తీ ప్రోబయోటిక్స్ పూర్తిగా నాశనమవుతాయి. అందుకే, పెరుగును గాజు లేదా పింగాణీ పాత్రలలో నిల్వ చేస్తే దాని ఫ్రెష్‌నెస్, పోషకాలు అలాగే ఉంటాయి.టమాటా కూరలు
టమాటాల్లో ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది. రాజ్మా లేదా పనీర్ కర్రీ వంటి టమాటా వంటకాలను స్టీల్ పాత్రలలో స్టోర్ చేసినప్పుడు, వాటిలోని యాసిడ్ కొన్ని పోషకాలను విచ్ఛిన్నం చేసి, రుచిని దెబ్బతీస్తుంది. ఆహారానికి ఒకరకమైన మెటల్ స్మెల్ కూడా రావచ్చు. ఈ రెసిపీలు ఫ్రెష్‌గా, సేఫ్‌గా, టేస్టీగా ఉంచుకోవడానికి గాజు లేదా పింగాణీ పాత్రలే సరైనవి.పండ్లు, ఫ్రూట్ సలాడ్లు
కట్ చేసిన పండ్ల ముక్కల నుంచి వచ్చే రసాలలో కొద్దిగా యాసిడ్ ఉంటుంది. ఈ రసాలు స్టీల్‌తో కలిసినప్పుడు, పండ్లకు ఒకరకమైన వింత టేస్ట్ వస్తుంది. ఎక్కువ సమయం నిల్వ ఉంచితే పండ్లు మెత్తబడి, తినడానికి బాగోవు.
