Eye Flu: ఓరినాయనో.. ఇంట్లో ఈగలు ఉంటే ఈ వ్యాధి వస్తుందట.. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జాగ్రత్త!

వర్షా కాలంలో సాధారణంగా కళ్ళకు సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా కళ్ళ కలకలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇది అంటువ్యాధిగా గుర్తించారు. కాలుష్యం, తగిన జాగ్రత్తల లేకపోవడం వల్ల ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు.సాధారణంగా వర్షా కాలంలో (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ) నెలల్లో కళ్ళ కలక వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కళ్ళ కలక వ్యాధి బ్యాక్టీరియా లేక వైరస్ వలన సోకే అంటూ వ్యాధి అని పెరుమాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆప్తమాలిక్ అధికారి వసంత తెలిపారు. ఈ కళ్ళ కలక వ్యాధి వచ్చిన వారికి కళ్ళు ఎరుపు ఎక్కడం వెలుతురు చూడలేకపోవడం, కన్ను నీరు కారడం, దురద, మంట, కన్ను పూసి కట్టడం, కన్ను నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి ఈగల ద్వారా, కళ్ళు కలక ఉన్న వ్యక్తి వాడిన వస్తువులు కళ్లకు దగ్గర పెట్టుకోవడం వల్ల వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటితో కళ్ళను తరచుగా శుభ్రం చేసుకోవాలి, శుభ్రమైన తువ్వాలుతో కళ్ళను తుడుచుకోవాలి. ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా అద్దాలు ధరించాలి, నేత్ర వైద్యులు సలహా మేరకు మందులు వాడాలి. కళ్ళ కలకలు ఉన్న వ్యక్తి వాడిన ఏ వస్తువును కూడా వాడకూడదు. కళ్ళు ఎక్కువగా నలపరాదు, కంట్లో మందు వేయడానికి ముందు తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే కళ్ళ కలకలు వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు అని ఆప్తమాలిక్ అధికారి తెలియజేస్తున్నారు. కళ్ళ కలకలు వచ్చేటప్పుడు కంటిని ఎక్కువగా నలపరాదు. కళ్ల కలక ఉన్న వ్యక్తి వాడిన రూమాలు, దిండ్లు, దుప్పట్లు వాడినట్లయితే వేరే వ్యక్తులు కూడా సంభవించే అవకాశం ఉందని కంటి వైద్యులు వసంతరావు తెలియజేస్తున్నారు. ఒకవేళ పిల్లల్లో ఈ కళ్ళ కలకలు వచ్చినట్లయితే పాఠశాలకు పంపించవద్దని తెలుపుతున్నారు. పూర్వం రోజులలో చేసే విధంగా కళ్ళలో ఆకుపసరు వంటి వాటిని వేయకూడదని హెచ్చరిస్తున్నారు. వైద్యుని సలహా మేరకు చుక్కల మందులు కంటిలో వేసుకోవాలని సూచిస్తున్నారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో పరిస్థితి మెరుగు పడకపోతే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

