“అమెరికాలోని ప్రతి భారతీయుడిని వెనక్కి పంపించాలి” – ఫ్లోరిడాకు చెందినరాజకీయనేత చాండ్లర్ లాంగేవిన్

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రాజకీయనేత చాండ్లర్ లాంగేవిన్ భారత్ పై సంచలన పోస్టు పెట్టారు. అమెరికాలో ఉంటున్న ఏ ఒక్క భారతీయుడికి కూడా అమెరికాపై ప్రేమ, శ్రద్ధ లేదని కీలక పోస్టు పెట్టారు. వాళ్లు మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే ఉన్నారని.. భారత్, భారతీయులు వృద్ధి చెందేందుకే అమెరికా ఉపయోగపడుతోందని పోస్టులో పేర్కొన్నారు. అంతేకాక అమెరికాలోని ప్రతి భారతీయుడిని బహిష్కరించాలన్నారు. ఆయన పోస్టు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. అంతేకాక అమెరికా కేవలం అమెరికన్ల కోసమే ఉందని లాంగేవిన్ మరో పోస్టులో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫ్లోరిడాకు చెందిన కౌన్సిలర్ చాండ్లర్ లాంగేవిన్ గతంలోనూ భారత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఆయన మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిపై స్పందిస్తూ.. దాని కింద భారత్ పై విద్వేషపూరిత పోస్టులు పెట్టారు. అయితే ఈ పోస్టు వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారత సంతతి ప్రజల ఫిర్యాదు మేరకు పామ్ బే సిటీ కౌన్సిల్ చర్యలు చేపట్టింది.

ఈ కౌన్సిల్ పై పిటిషన్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. ఇక చాండ్లర్ లాంగేవిన్ పోస్టుపై యూఎస్ లో ఉన్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు ఇలా విలువలు తగ్గించేలా మాట్లాడటం, ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్డడం తగదని పేర్కొన్నారు. ఆయన పోస్టులను సీరియస్ గా తీసుకున్న పామ్ బే సిటీ కౌన్సిల్.. లాంగేవిన్ ను కౌన్సిల్ నుంచి తొలగించింది. ఇకనుంచి లాంగేవిన్ ఎలాంటి విద్వేషపూరిత పోస్టులు పెట్టకూడదని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. మరోవైపు కౌన్సిల్ నిర్ణయాన్ని తప్పుబట్టిన లాంగేవిన్.. కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపారు.