Even star heroines were pushed back with just one hit.

సినీరంగంలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు మాత్రం పడలేదు.. కానీ ఇప్పుడు సాలిడ్ హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది.  సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది.

తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మలయాళంలో మాత్రం వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంటో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అమ్మడి నటనకు మంచి మార్కులుపడ్డాయి.

ఆ తర్వాత తెలుగులో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.

రీసెంట్ గా కొత్త లోక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కళ్యాణి. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన సూపర్‌హీరో థ్రిల్లర్ ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *