EV Bike: Honda EV bike with a cool look.. Shocked to know how much mileage it gets..!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈవీ వాహనాలను ఇష్టపడడంతో పెద్ద సంఖ్యలో కంపెనీలు ఈవీ బైక్‌లు, స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హోండా గ్వాంగ్జౌ సహకారంతో చైనాలో కొత్త ఈవీ బైక్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ ఈవీ బైక్‌పై కొన్ని ప్రత్యేక వార్తలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

హోండా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయిన ఈ-వీఓను చైనాలో ఆవిష్కరించింది. చైనా స్థానిక కంపెనీ అయిన గ్వాంగ్జౌ సహకారంతో ఈ ఈవీ బైక్‌ను అభివృద్ధి చేశారు. ఈ బైక్ ధర మన కరెన్సీలో సుమారు రూ. 3.56 లక్షల నుంచి రూ.4.39 లక్షలు మధ్య ఉంటుంది. హోండా ఈ-వీఓ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 4.1 కేడబ్ల్యూహెచ్, 6.2 కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది. కేఫ్-రేసర్ మోడల్ 4.1 కేడబ్ల్యూహెచ్, 6.2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌లకు వరుసగా 143 కిలోలు, 156 కిలోల బరువు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ ప్రామాణిక లక్షణంగా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ను కూడా పొందుతుంది. ఇది నలుపు, తెలుపు రెండు రంగుల ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. 

ఈ ఈవీ బైక్ 7 అంగుళాల టీఎఫ్‌టీ డాష్‌బోర్డ్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్యాటరీ ఎస్ఓసీ వంటి కొన్ని ఆధునిక లక్షణాలు ఆకట్టుకుంటాయి. ఈ బైక్స్ ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లలో అందుబాటులో ఉంటాయి. 4.1 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌తో ఫ్రంట్ డాష్‌క్యామ్ ప్రామాణికంగా అందిస్తారు. అయితే 6.2 కేడబ్ల్యూహెచ్ గ్రేడ్ వెనుక డాష్‌క్యామ్‌తో అందుబాటులో ఉంటుంది. 4.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 120 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 6.2 కేడబ్ల్యూహెచ్ గ్రేడ్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 

పోర్టబుల్ ఏసీ హోమ్ ఛార్జర్ ద్వారా 1 గంట 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. సాంప్రదాయ కారు ఛార్జర్ దాదాపు గంట సమయం పడుతుంది. మరోవైపు హోమ్ ఛార్జర్‌తో 2 గంటల 30 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్‌తో యాడ్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్ 20.5 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని అందిస్తుంది. సుజుకీ, యమహా వంటి జపనీస్ పోటీ కంపెనీల మాదిరిగానే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో హోండా ఆలస్యంగా ప్రవేశించిన వాటిలో ఒకటిగా ఉంది. భారతీయ మార్కెట్ విషయానికొస్తే హోండా రెండు నెలల క్రితం యాక్టివా-ఈ, క్యూసీ-1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రవేశపెట్టిన విషయం విధితమే.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *