Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హవా.. దీనికి ఎందుకంత డిమాండ్?

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో తాము రికార్డు సృష్టిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ స్వప్నిల్ జైన్ అన్నారు. 5,00,000 స్కూటర్ల తయారీ దాటడం చాలా పెద్ద మైలురాయిగా ఉందన్నారు. మొదటి ప్రోటోటైపు నుండి ఇప్పటివరకు, మా ప్రయాణం వాహనాలు..Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో హవా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యం ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా హవా కొనసాగిస్తున్నాయి. మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లోనే ఎక్కువ రేంజ్ ఇచ్చేలా స్కూటర్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో భారతీయ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ అద్భుతమైన స్కూటర్లను తీసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన స్కూటర్లు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. తమ హోసూర్ ప్లాంట్‌లో తయారుచేసిన 5,00,000వ స్కూటర్‌ను విడుదల చేసి, దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీని కొత్త ఎత్తుకి తీసుకు వచ్చింది. ఈ స్కూటర్ ఏథర్ రిజ్టా మోడల్. ఈ కంపెనీ నుంచి కుటుంబ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తోంది. గత సంవత్సరం ఇది మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.రికార్డును సృష్టిస్తున్నాం: కంపెనీ సీఈవో
ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో తాము రికార్డు సృష్టిస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ స్వప్నిల్ జైన్ అన్నారు. 5,00,000 స్కూటర్ల తయారీ దాటడం చాలా పెద్ద మైలురాయిగా ఉందన్నారు. మొదటి ప్రోటోటైపు నుండి ఇప్పటివరకు, మా ప్రయాణం వాహనాలు మాత్రమే కాకుండా, పెద్ద స్థాయిలో, నమ్మకమైన తయారీ వ్యవస్థను కూడా సృష్టించడమే లక్ష్యమని అన్నారు.
గరిష్ట వేగం:
ఇప్పటివరకు మొత్తం తయారీ వాల్యూమ్‌లో మూడవ భాగం ఏథర్ రిజ్టా మోడల్‌దే. ఏథర్ రిజ్టా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఏప్రిల్ 2024లో విడుదలైంది. దీనిలో 4.3 కిలోవాట్ పర్మనెంట్ మాగ్నెటిక్ సింక్రనస్ మోటార్ ఉంటుందని అన్నారు ఇది 22 న్యూటన్-మీటర్ల టార్క్ ఇస్తుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు కాగా, 0 నుండి 40 కిలోమీటర్ల వేగానికి సుమారు 4.7 సెకన్లు పడుతుందని కంపెనీ చెబుతోంది.
రెండు బ్యాటరీ ఆప్షన్లు:
ఈ స్కూటర్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయని, 2.9 కెహెచ్ బ్యాటరీతో 123 కి.మీ వరకు రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మరొక 3.7 కెహెచ్ బ్యాటరీతో 160 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌కు పూర్తి ఛార్జింగ్ కావాలంటే సుమారు 8.3 గంటల సమయం పడుతుంది. అలాగే స్టోరేజీ విషయంలో కూడా బాగుంది. సీట్ కింది భాగంలో 34 లీటర్ల స్టోరేజీని అందించింది. ఇక ముందు భాగంలో 22 లీటర్ల అదనపు ట్రంక్ ఉంది.ఇందులో హెల్మెట్ పెట్టుకోవడానికి, సరుకులు తీసుకురావడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఫీచర్స్:
ఈ స్కూటర్‌లో అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్, వైఫై కనెక్టివిటి, రిమోట్ లాకింగ్ సిస్టమ్,7 అంగుళాల డిస్‌ప్లే, టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్, ట్రిప్ మానిటరింగ్ ఛార్జింగ్ పోర్ట్ ఇలాంటి ఫీచర్స్‌తో పాటు మర్నె ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే ధరల విషయానికొస్తే.. రూ.1,09,999 నుండి రూ.1,44,000 వరకు ఉన్నాయి.

