Electric Scooter Offer: రూ.59,999ల ఈవీ రూ.35,800కే. 60కిమీ మైలేజ్. 100కిమీకి రూ.20 మాత్రమే!

Electric Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుక్కోవాలి అనుకునేవారికి చాలా ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ఈ స్కూటర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. దీని బ్యాటరీని బయటకు తీసి ఛార్జింగ్ చేసుకునే వీలు ఉంది. అందువల్ల దీన్ని ఇష్టంగా కొంటున్నారు. ఇక్కడ మనం దీని పూర్తి వివరాలు చూద్దాం.ఫస్ట్ మనం ఈ స్కూటర్‌ని ఎందుకు కొంటున్నారు అనేది ఆలోచిస్తే.. దీని లుక్ బాగుంది, 2 కలర్స్‌లో లభిస్తోంది. చాలా ఈవీలతో పోల్చితే ధర తక్కువగానే ఉంది. బరువు తక్కువ కాబట్టి.. ఈజీగా వెళ్లిపోతుంది. తక్కువ ప్రదేశంలోనే పార్కింగ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అందువల్ల ఓ 10వేల రూపాయలు సేవ్ అయినట్లే. అలాగే ఇది గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో మాత్రమే వెళ్తుంది కాబట్టి.. దీన్ని నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. పెద్దవాళ్లు, యువత నడిపేందుకు వీలుగా దీన్ని తయారుచేశారు.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని EOX కంపెనీ తయారుచేసింది. దీని పేరు OKO. దీని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే.. 50 నుంచి 60కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. ఈ స్కూటర్ మీకు బ్లాక్, బూడిద రంగులో లభిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ స్కూటర్‌కి మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో, స్పోర్ట్స్, హై. తద్వారా బ్యాటరీని ఆదా చేసుకునేలా డ్రైవింగ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి BLDC హెవీ మోటర్ ఇచ్చారు. సాధారణంగా తక్కువ ధర ఈవీలకు ఈ మోటర్ ఉండదు. ఎందుకంటే ఈ మోటర్ రేటు ఎక్కువ. కానీ దీనికి ఉంది కాబట్టి.. అది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అలాగే ఆ మోటర్‌పై నీరు పడినా ఏమీ కాదని (Waterproof) చెప్పారు.బ్యాటరీ:మనం ఏ ఈవీ కొన్నా, దాని బ్యాటరీ ఎలాంటిదో తప్పక చూస్తాం. దీనికి రిమూవబుల్ బ్యాటరీ ఇచ్చారు. అది 48V లిథియం అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీని మనం బయటకు తీసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంట్లో, ఆఫీసులో ఛార్జ్ చేసుకునే వీలు ఉంది. మనకు స్కూటర్‌తోపాటూ.. బ్యాటరీ, ఛార్జర్ కూడా ఇస్తున్నారు. అంటే.. అదనపు బ్యాటరీ ఇవ్వరు. స్కూటర్‌లోనే ఒక బ్యాటరీ ఉంది. ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి.. దానితో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ సాకెట్‌లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఫుల్లుగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటలు పడుతుందని చెప్పారు. ఐతే.. మనం రాత్రి ఛార్జ్ పెట్టి నిద్రపోతే, ఫుల్ ఛార్జ్ అవ్వగానే.. ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ ఆపేసుకునే ఫీచర్ ఉంది. కాబట్టి.. మన కరెంట్ వేస్ట్ అవ్వదు. ఈ బ్యాటరీకి మంటలు అంటుకున్నా కాలదు (Fireproof-Coated) అని తెలిపారు. నీరు, దుమ్ము పడినా పాడవకుండా బ్యాటరీకి IP67 రేటింగ్ ఉన్నట్లు చెప్పారు.
డిజైన్:మీరు ఫొటోలలో చూస్తే.. స్కూటర్ డిజైన్ అందరికీ నచ్చుతోంది. దీనికి డిజిటల్ డిస్‌ప్లే ఉంది. టైర్ సైజు ముందు 10 అంగుళాలు, వెనక 10 అంగుళాలు ఉంది. ట్యూబ్ లేని టైర్లు ఇచ్చారు. ఫలితంగా ఎప్పుడైనా ప్యాచ్ పడినా.. టైర్లు నడుస్తాయి. రిపేర్ షాపు దగ్గరకు బండిని నడిపించుకుంటూ వెళ్లగలం. బ్రేకుల విషయానికి వస్తే రెండూ డ్రమ్ బ్రేకులే ఇచ్చారు. ఐతే.. వేగం తక్కువే కాబట్టి.. డ్రమ్ బ్రేకులైనా పర్వాలేదు. డిస్క్ బ్రేకుల అవసరం ఉండదు. అందుకే అవి ఇవ్వనట్లున్నారు. ఈ స్కూటర్‌కి మంటలు అంటుకోని ఫైర్ ప్రూఫ్ కోటింగ్ ఉన్నట్లు చెప్పారు.స్మార్ట్ ఫీచర్లు:ఈ స్కూటర్‌కి యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టం ఉంది. అందువల్ల ఎవరూ చోరీ చెయ్యలేరు. ఎవరైనా ట్రై చేస్తే.. స్కూటర్‌ని కదిపితే.. వెంటనే మొబైల్ యాప్ ద్వారా.. అలర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. దాంతో చోరీ చెయ్యలేరు. ఈ స్కూటర్‌కి ముందు వైపు DLR ఫ్రంట్ ల్యాంప్ ఇచ్చారు. అది చిన్నగా, క్యూట్ లుక్‌తో ఉంది. పార్కింగ్ మోడ్ కూడా ఉంది. అంటే.. మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు.. అక్కడ కిందికి వాలుగా ఉంటే.. స్కూటర్ జారిపోకుండా ఉండగలదు. అలాగే.. ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు.. వేరే వాళ్లు ఈ స్కూటర్‌ని కదపకుండా ఈ మోడ్ ఉపయోగపడుతుంది.
ఈ స్కూటర్ అసలు ధర రూ.59,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 33 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.39,999కే అమ్ముతున్నారు. అలాగే.. ఈ స్కూటర్‌ని 20 రకాల క్రెడిట్ కార్డులలో దేనితోనైనా కొంటే.. మరో రూ.3,000 దాకా తగ్గింపు లభిస్తుంది. అలాగే.. అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్ ఉపయోగించుకుంటే మరో రూ.1,199 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈ స్కూటర్ మీకు.. రూ.35,800 లభించినట్లు అవుతుంది. అప్పుడు మీకు ఈ స్కూటర్‌పై మొత్తం 40 శాతం డిస్కౌంట్ వచ్చినట్లవుతుంది. మీరు EMIలో పొందాలనుకుంటే రూ.1,939కి పొందవచ్చు.
ఈ స్కూటర్ బరువు 60 కేజీలు. ఇది 140 కేజీల బరువు మొయ్యగలదు. ముందు, వెనక కూడా సస్పెన్షన్ ఇచ్చారు. అందువల్ల గతుకుల రోడ్లపై వెళ్లేటప్పుడు, కుదుపుల్లో నడుం విరిగిపోకుండా ఉండగలదు. ఈ స్కూటర్ నడిపేవారికి హెల్మెట్ కూడా అవసరం లేదని తెలిపారు. ఐతే.. ఉంటే మంచిదే. రోజువారీ అవసరాలకూ, స్టూడెంట్స్, యువతకు ఇది చాలా బాగుంటుందని చెప్పారు. పెట్రోల్ బైక్‌లకు ఇంజిన్ ఆయిల్ మార్చాల్సి ఉంటుంది. దీనికి ఆ అవసరం లేదు. బ్యాటరీ ఛార్జింగ్, టైర్లలో గాలి నిండుగా ఉండేలా చూసుకుంటే చాలు. ఐతే.. సీటు కింద.. సరుకులు పెట్టుకునేందుకు స్పేస్ ఉందా అనేది చెప్పలేదు. ఈ డౌట్ ఇలాగే ఉండిపోయింది. ఈ స్కూటర్ కోసం ఆర్డర్ ఇస్తే.. 8 నుంచి 15 రోజుల్లో ఫ్రీ డెలివరీ చేస్తారు. ఐతే.. స్కూటర్, బ్యాటరీ వారంటీ వివరాలేవీ చెప్పలేదు.
దీనికి అమెజాన్‌లో 3.8/5 రేటింగ్ ఉంది. ఇప్పటికే దీన్ని 23 మంది కొన్నారు. వారు ఇచ్చిన రివ్యూల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ క్వాలిటీ బాగుంది. ఒక రివ్యూవర్ ఏం చెప్పారంటే.. బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే, 40 కిలోమీటర్లు వెళ్తోందని చెప్పారు. ఐతే.. కంపెనీ 60 కి.మీ మైలేజ్ ఇస్తుందని చెప్పింది. రియాలిటీలో అలా లేదని అనుకోవచ్చు. కస్టమర్లు.. ఈ స్కూటర్ వాడేందుకు అనుకూలంగా ఉంది అని చెబుతన్నారు. తేలికైన డిజైన్ ఉందనీ, డబ్బుకి తగిన వాల్యూ ఉందని తెలిపారు. అంతేకాదు.. పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పారు. స్మూత్ రోడ్లపై ఈ స్కూటర్ బాగా వెళ్తోందని ఒకరు రివ్యూ ఇచ్చారు. డిజైన్‌పై కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. గీతలు పడకుండా ఉంటుందా అనే విషయంలో మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.
