Dude Movie: ‘డ్యూడ్’ సినిమాకు తెలుగులో భారీ బిజినెస్.. ఇదెక్కడి మాస్‌రా మామ!

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ట్రాక్‌పై దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఒకరు.తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ట్రాక్‌పై దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఒకరు. తన ప్రత్యేకమైన నటన, యూత్‌ఫుల్ ఎనర్జీ, ఎమోషన్‌తో మిళితమైన కామెడీ టైమింగ్‌తో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు మరో సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం “డ్యూడ్ (Dude Movie)” దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్‌లు, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుని సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. సోషల్ మీడియాలో “డ్యూడ్ ఈయర్ బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అవుతుందంటూ” నెటిజన్లు హైప్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసిన “లవ్ టుడే” ఎంత బ్లాక్‌బస్టర్ అయిందో గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత డ్రాగన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ఇప్పుడు “డ్యూడ్”తో ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నట్లు ట్రేడ్ టాక్ వినిపిస్తోంది.
