Dude Day 2 Box Office Collections: What is the box office situation on Dude Day 2? How many crores does Pradeep’s movie have?

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైద్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మించిన చిత్రం డ్యూడ్. తమిళ సినీ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు సినిమాతో ప్రేక్షకులకు చేరువైన మమిత బైజు జంటగా నటించారు. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు.

రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో ఆర్ శరత్ కుమార్, హిృదు హరూన్, డెవిడ్ సెల్వమ్, రోహిణి, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాధ్యతలను, సాయి అభయంకర్ మ్యూజిక్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు చేసింది? ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ప్రేమ కథా చిత్రంగా రూపొందిన డ్యూడ్ సినిమాను భారీగా రూపొందించారు. తాను ఇష్టపడిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే యువకుడిగా ప్రదీప్ రంగనాథన్ నటించాడు. ఈ సినిమాకు హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రదీప్ నటించిన గత రెండు చిత్రాలు కూడా భారీ విజయం సాధించడంతో డ్యూడ్ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. డ్యూడ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బిజినెస్‌ను 60 కోట్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తమిళనాడు 31 కోట్ల రూపాయలు, నైజాం, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ 6 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా సుమారుగా 120 కోట్ల రూపాయల గ్రాస్, 60 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం నిర్మాతలు వెల్లడించిన ప్రకారం.. 22 కోట్ల రూపాయల గ్రాస్, ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ప్రకారం 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళంలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 3.5 కోట్ల రూపాయలు, కన్నడలో 1.5 కోటి రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు కంటే తక్కువగా వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తమిళనాడు, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో కలిపి 6 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. దాంతో ఈ మూవీ రెండు రోజుల్లో 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. భారీగానే వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *