ఆల్కహాల్ తీసుకుంటే ఆ కౌంట్ తగ్గి పిల్లలు పుట్టరట.. జాగ్రత్త..

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మగవారిలో ఇవి లైంగిక సామర్థ్యాన్ని, పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతారు. దీని గురించి డాక్టర్ ఏమంటున్నారో తెలుసుకోండి.
మద్యపానం అనేది ఎన్నో సమస్యలకి కారణం అని చెబుతారు. ముఖ్యంగా మగవారి ఆరోగ్యంపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. అదనంగా, మద్యపానం తీసుకోవడం వల్ల మగవారికి పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలకి కారణమవుతుంది. ఈ సమస్యకి ఇప్పటికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, IVF వంటి ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. దీని గురించి ఇందిరా IVF CEO & Cofounder డాక్టర్ క్షితిజ్ ముర్దియా దీని గురించి చెబుతున్నారు.
చాలామంది ఆల్కహాల్ తాగితే శృంగారం బాగా చేయొచ్చొని అనుకుంటారు. ఇది నిజానికి అపోహే. దీని వల్ల మగవారిలో అంగస్తంభన సమస్యలకి కారణమవుతుంది. శీఘ్ర స్కలనం వంటివి ఎదురవుతాయి. అంతే కాకుండా బ్రెయిన్‌పై ఎఫెక్ట్‌ని చూపిస్తుంది.
దీని ద్వారా లైంగిక ఆరోగ్యం, ఆసక్తి తగ్గుతుంది. రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటే మగ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. గర్బధారణని నిరోధిస్తుంది.
అదే విధంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్ సమస్యలన్నీ కూడా గర్బధారణని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ సహజ గర్భధారణని ప్రభావితం చేయడమే కాకుండా, మగ స్పెర్మ్, గుడ్డుతో బాహ్యంగా జరిగే IVF వంటి ప్రక్రియని కూడా అడ్డుకుంటుంది.
IVF విజయాన్ని ఎఫెక్ట్ చేసే హానికరమైన కారకాల్లో ఆల్కహాల్ ఒకటి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ నాణ్యతని ప్రభావితం చేస్తుంది. IVF ఫెయిల్ అవ్వడానికి ఇది కూడా కారణమే. స్మెర్మ్ గుడ్డులో చేరిన ఫలదీకరణని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల పిల్లలు పుట్టకుండా అడ్డుకుంటుంది.
హార్మోన్ల బ్యాలెన్స్ ఉండాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. మద్యపానానికి దూంగా ఉండాలి. హెల్దీ లైఫ్‌స్టైల్, మద్యపానం, దూమపానం వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల IVF సక్సెస్ అయి పిల్లలు కావాలనే కోరిక తీరుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

