Dragon Fruit: This fruit is a nectar for women.. Eating it once gives you enough energy for a month.. A check for those diseases!

డ్రాగన్ ఫ్రూట్ రుచికరమైనది మాత్రమే కాదు.. పోషకాల స్టోర్‌ హౌస్‌గా పిలుస్తారు. ఇందులో ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కలంగా నిండివున్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌, ఖనిజాలు ఎక్కువగా సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల ఈ పండు ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. అంతేకాకుండా.. బి1, బి2, బి3 విటమిన్లు కూడా మెండుగా ఉన్నాయి. తరచూ డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటూ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ పండు వరంలాంటిది అని అంటున్నారు. ఎందుకో..ఈ ఫ్రూట్ వల్ల ఆడవాళ్లకు కలిగే ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో వచ్చే అనేక సమస్యలను తగ్గిస్తాయి. మహిళలకు ఐరన్ చాలా అవసరం. నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా మహిళల్లో ఐరన్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో అధిక మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలపడుతాయి. ముఖ్యంగా మహిళలు మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే అంటువ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *