గుప్పెడు పొట్టే కదా అని లైట్ తీస్కోవద్దు, గుండె సమస్యలతో పాటు ఎన్నో ప్రమాదసమస్యలొస్తాయి, అవేంటంటే …

చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. ఇది మొదట్లో చిన్నగానే ఉంటుంది. కానీ, రాన్రాను పెరుగుతుంది. దీంతో చూడ్డానికి ఇబ్బందిగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా అస్సలు మంచిది కాదు. బెల్లీ పెరిగితే ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారతాయి. ఇందులో ప్రాణాలకే ప్రమాదంగా మారిన గుండె సమస్యల దగ్గర్నుంచీ ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. వీటి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో బెల్లీని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది.
బెల్లీ ఫ్యాట్. ఇది చాలా మందికి ఉండే సమస్యే. కాస్తా తిన్నా, లేదంటే కొద్దిగా బరువు పెరిగినా ముందుగా బెల్లీ ఫ్యాట్ ముందుకొచ్చేస్తుంది. దీనిని కవర్ చేసుకోవడానికి ఎంతగానో కష్టపడతాం. దీని వల్ల అందంగా కనిపించకపోవడం మాత్రమే కాదు. మరెన్నో సమస్యలు ఉంటాయి. అందుకే, బెల్లీని తగ్గించుకోవాలి. అసలు బెల్లీ కారణంగా ఎలాంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయో ముందుగా తెలుసుకోండి. దీంతో ఓ అవగాహన వచ్చి చాలా వరక బెల్లీని తగ్గించుకుంటారు. బెల్లీ కామన్ అని అలా నిర్లక్ష్యం చేయకండి ఇది పెరిగితే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.
గుండె సమస్యలు
బెల్లీ ఫ్యాట్ కారణంగా బెల్లీ చుట్టూ ఉండే అవయవాల్లో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీని వల్ల బ్లడ్ ప్రెజర్, గుండె సమస్యలు, స్ట్రోక్ వంటివి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఎప్పటికప్పుడు కూడా బెల్లీని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. బెల్లీ పెరిగిందంటే గుండెకి ప్రమాదం పొంచి ఉన్నట్లే. కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా ముందుగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోండి.
హార్మోనల్ ప్రాబ్లమ్స్
బెల్లీ ఫ్యాట్ కారణంగా విజెరల్ ఫ్యాట్ పెరుగుతుంది. దీని వల్ల ఈస్ట్రోజెన్, ఇన్సులిన్, కార్టిసాల్ లెవల్స్ పెరిగి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఆడవారికి ముఖ్యంగా ఇరెగ్యులర్ పీరియడ్స్, అలసట, బరువు పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు బెల్లీని పెంచుకోకుండా చూడండి.
