Donkey Milk Secret: గాడిద పాలకు ఎందుకు అంత డిమాండ్.. నిజం తెలిస్తే ఎంత డబ్బైన ఖర్చు చేస్తారు

Donkey Milk Secret: తెలంగాణలోని మంచిర్యాల నుండి గంగారామ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 30 గాడిదలను లారీలో తీసుకుని వచ్చి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తిరుపతి,మదనపల్లి, పీలేరు,పలమనేరు లాంటి చోట్ల వారం రోజులు లేదా ఐదు రోజులు ఉంటూ పట్టణ ప్రాంతంలో తిరుగుతూ గాడిద పాలన అమ్ముతూ లోకల్ 18 కి కనపడ్డాడు.Donkey Milk Secret: తెలంగాణలోని మంచిర్యాల నుండి గంగారామ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 30 గాడిదలను లారీలో తీసుకుని వచ్చి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తిరుపతి,మదనపల్లి, పీలేరు,పలమనేరు లాంటి చోట్ల వారం రోజులు లేదా ఐదు రోజులు ఉంటూ పట్టణ ప్రాంతంలో తిరుగుతూ గాడిద పాలన అమ్ముతూ లోకల్ 18 కి కనపడ్డాడు గంగరామ్ ని పలకరించగా వారి తాతల ముత్తాతల కాలం నుండి గాడిద పాలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నామని రాష్ట్ర మొత్తం తిరుగుతామని రోజుకు 500 రూపాయల నుండి 3000 రూపాయల వరకు వ్యాపారం జరుగుతుందని ఒక చిన్న 10 ఎంఎల్ డబ్బా ₹100 రూపాయల వరకు అమ్ముతాము అని గాడిద పాలు తాగితే చిన్నపిల్లలకి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నామని గంగారం చెబుతున్నారు.
అయితే గాడిద పాలు పిల్లలకు తాగించడానికి గల ప్రధాన కారణాలు నమ్మకాలు గాడిద పాలను పిల్లలకు, ముఖ్యంగా శిశువులకు తాగించడం అనేది చాలా కాలంగా కొన్ని సంప్రదాయాలు నమ్మకాలలో ఉంది. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే:గాడిద పాలు మానవ తల్లి పాలతో పోలిన పోషక విలువలను కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆవు పాలు ఇతర జంతువుల పాలతో పోలిస్తే, ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు ఖనిజాలు దాదాపు సమానంగా ఉంటాయని అంటారు. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం ఆవు పాలలోని కొన్ని ప్రోటీన్లకు అలెర్జీ ఉన్న పిల్లలకు గాడిద పాలు ఒక మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి.
