ఇంట్లోని వారంతా ఒకే సబ్బుని వాడుతున్నారా, అలా చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా ?

మన దగ్గర చాలా మంది ఇళ్లలో ఒకే సబ్బుని ఇంట్లో వారంతా వాడతారు. ఇది చాలా కామన్. అయితే పెరిగిన హైజీన్ వల్ల చాలా మంది విడివిడిగా సబ్బుని వాడడం వాడుతున్నారు. అయినప్పటికీ, కొంతమంది ఒకేసబ్బుని వాడుతున్నారు. దీని వల్ల చాలా సమస్యలొస్తాయి. ఒకే ఇంట్లోని వారంతా ఒకే సబ్బు వాడడం అనేది ఎప్పట్నుంచో ఫాలో అవుతున్న బేసిక్ థింగ్. ఇప్పుడంటే సెపరేట్ బాత్‌రూమ్స్, సపెరేట్ సిస్టమ్స్ వచ్చాయి. అయినప్పటికీ చాలా చోట్ల ఇంట్లోని వారంతా స్నానం చేయడానికి ఒకే సబ్బుని వాడుతుంటారు. దీని వల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇది మంచిది కాదని సూచిస్తున్నారు. అందరూ కలిసి ఒకే సబ్బు వాడడం వల్ల వచ్చే సమస్యలేంటి? అలా కాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
ఒకే సబ్బు వాడితే
స్నానానికి ఇదివరకటి రోజుల్లో అయితే సున్నిపిండి వంటివి వాడేవారు. కానీ, రోజులు మారాయి. సబ్బులొచ్చాయి. దీంతో సబ్బు తెచ్చి వాడడం మొదలుపెట్టారు. ఒక్క సబ్బు తీసుకొస్తే ఇంట్లోని వారంతా దాంతోనే స్నానం చేయడం ముఖం కడగడం వంటివి చేసేవారు. అయితే, ఈ అలవాటు వల్ల చర్మవ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. అవేంటంటే
అందరికీ ఒకే సబ్బు సెట్ కాకపోవడం
అందరూ ఒకే ఇంట్లో వారైనా ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. దీంతో ఒకరి అవసరాలకి తగిన సబ్బు మరొకరికి సెట్ కాకపోవచ్చు. ఒకరిది డ్రై స్కిన్ అయి కాస్తా మాయిశ్చర్ సబ్బు వాడితే మరొకరిది ఆయిలీ స్కిన్ అయి మైల్డ్ సోప్ వాడతారు. ఇలాంటి సందర్భంలో అందరికీ ఒకే సబ్బు పడదు. అలా కాదని వాడితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

