పైల్స్ ఫిస్టులా ఉన్న వారు కొన్ని ఫుడ్స్ జోలికి అసలు పోకూడదు, ఏమేం తినకూడదో చెప్పిన డాక్టర్

పైల్స్, ఫిస్టులా లాంటి సమస్యలున్న వారు ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు తినకూడదు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత త్వరగా సమస్యలు తగ్గిపోతాయి.మలబద్ధకంతో ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏది తిన్నా జీర్ణం కాక, సరిగ్గా మోషన్ అవక ఎన్నో అవస్థలకు గురి అవుతున్నారు. బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతూ సమస్యను పెంచుకుంటున్నారు. వీరి బాధ ఇలా ఉంటే. పైల్స్ వచ్చిన వారి బాధ మరోలా ఉంటుంది. ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో, హేళన చేస్తారేమో అని గిల్టీగా ఫీల్ అవుతారు. కానీ..ఇలాంటి అనారోగ్యాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా పైల్స్, ఫిస్టులా లాంటి సమస్యలున్న వారు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల ఫుడ్స్ కి వీళ్లు దూరంగా ఉంటేనే మంచిదని వారిస్తున్నారు. మరి పైల్స్, ఫిస్టులా ఉన్న వారు ఎలాంటి ఫుడ్స్ తినకూడదు. వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుందామా.
ఆహారం జాగ్రత్తలు
పైల్స్, ఫిస్టులా లాంటి సమస్యలున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ ఇబ్బందులు ఉన్న వారు ఏం తింటున్నారనే దాన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత వరకూ తగ్గుతుంది అనేది చెప్పవచ్చు అంటున్నారు వైద్యులు. కొన్ని రకాల ఆహార పదార్థాలు మంచి చేస్తే ఇంకొన్ని మాత్రం సమస్యను ఇంకా పెంచుతాయి. ఇవి తిన్న వెంటనే పొట్టలో మంట పెరుగుతుంది. బాడీ ఇంతా ఇన్ ఫ్లమేషన్ ఎక్కువవుతుంది. వీటి వల్ల తిన్నది సరైన విధంగా జీర్ణం కాదు. దీని వల్ల మలబద్ధకం వస్తుంది. అప్పుడు పైల్స్, ఫిస్టులా సమస్యలు తగ్గడం ఇంకాస్త ఇబ్బందికరంగా మారుతుంది. డాక్టర్ చెప్పిన ఆ పదార్థాలేంటో వివరంగా చూద్దాం. మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ని వీలైనంత వరకూ అవాయిడ్ చేయాలి. వీటి వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతంది. సరైన విధంగా ఆహారం జీర్ణం కాదు. ఇవి తినడం వల్ల పొట్టలో మంట వస్తుంది. దీంతో పాటు అరగకపోవడం వల్ల నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవి పిస్టులా, పైల్స్ సమస్యని ఇంకాస్త ఇబ్బందికరంగా మార్చుతాయి. ఇక వీటితో పాటు రెడ్ మీట్ అసలు తినకూడదు. ఇది అంత సులువుగా జీర్ణం కాదు.
అందుకు కారణం ఏంటంటే..ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం వచ్చే అవకాశముంటుంది. అందుకే వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఇక వేపుళ్ల జోలికి కూడా అసలు పోకూడదు. ఇవి జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి. మోషన్ ఫ్రీగా అవ్వడానికి వీలు లేకుండా చేస్తాయి. అందుకే వేపుళ్లను పూర్తిగా అవాయిడ్ చేయాలి.

