డాక్టర్ గారు నా వృక్షణాలు కిందకి పై కి ఉన్నాయి. సమస్య ఏంటి ?

ప్రశ్న ?
డాక్టర్ నా వయస్సు 24నాలుగు ఏళ్లుగా ఎడమ వృక్షణం… కుడి వృక్షణం కంటే కిందకి జారీ ఉంది. పైగా కాస్త లావుగా కూడా వుంది. దానిని నొక్కి చూస్తే అడుగు భాగాన్న నాకు చిన్న చిన్న నరాలు లాగ తగులుతున్నాయి. ఈ మధ్య నెలకు ఒక్క సారి ఎడమ కాలు, ఎడమ చెయ్యి, ఎడమ భుజం విపరీతముగా నొప్పి పుడుతున్నాయి. ఎడమళాలు మీద , ఎడమ భుజం మీద, నాలుగైద్య్ కణుతుల్లాగా వచ్చాయి. వాటిని నొక్కితే గట్టిగా ఉన్నాయి. పొత్తి కడుపు ఎడమవైపున వాపు కూడా వుంది. నా సమస్యను ఏమంటారు. ఇవి తీరాలంటే ఏమి చెయ్యాలి.
జవాబు ?
మీకు వెరికోసిల్ ఉన్నట్టు వుంది. మామూలుగా ఒక వృక్షణం కిందకి పైకి ఉంటాయి. అయితే మీరు చెప్పినట్లు వాపు ఉండడము రక్త నాళాలు తగలడం వెరికోసిల్ లక్షణాలు. ఇది గ్రేడ్ వన్ లో ఉంటే సర్జరీ అవసరం లేదు. మందులతో తగ్గుతుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 గ్రేడ్ 4 అయితే చికిత్స లేదా సర్జరీ అవసరం. మీకు గడ్డలు గా తగులుతున్నవి లింప్ గ్రంధులు. దీనిని లిమ్పటి నోపతి అంటారు. శరీరం ఇన్ఫెక్షన్ ఉందని సూచనలు ఇస్తాయి. ఈ లింప్ గలాండ్స్ మీరు వెంటనే ఆండ్రాలజిస్ట్ ని సంప్రదించి చికిత్స తీసుకోండి. అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి సెమెన్ ఎనాలిసిస్ చేసుకోండి.
News by : V.L
