Do you know why you urinate frequently during the rainy season? Know the causes and precautions

వర్షాకాలంలో ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో మార్పు కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. మరి మిగతా కారణాలేంటో తెలుసుకోండి.రోజుకు మీరు ఎన్ని సార్లు యూరిన్ పాస్ చేస్తారు. మహా అయితే నాలుగు లేదా ఐదు సార్లు. మీరు సరైన విధంగా నీళ్లు తీసుకుంటే నాలుగైదు సార్లు యూరిన్ రావడం అనేది మామూలే. కానీ..అంతకు మించి వెళ్లాల్సి వస్తోందంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్తపడాలి. అయితే…ఇలా తరచూ యూరిన్ రావడానికి కేవలం అనారోగ్యం మాత్రమే కారణం కాకపోవచ్చు. కొన్ని సార్లు వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీరు సరిగ్గా గమనిస్తే వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. మరి ఇలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. వర్షాకాలంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడానికి కారణాలేంటి. ఇలా జరగడం వెనక అసలైన రీజన్స్ ఏంటి. ఈ వివరాలు తెలుసుకుందాం.రోజుకు మీరు ఎన్ని సార్లు యూరిన్ పాస్ చేస్తారు. మహా అయితే నాలుగు లేదా ఐదు సార్లు. మీరు సరైన విధంగా నీళ్లు తీసుకుంటే నాలుగైదు సార్లు యూరిన్ రావడం అనేది మామూలే. కానీ..అంతకు మించి వెళ్లాల్సి వస్తోందంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్తపడాలి. అయితే…ఇలా తరచూ యూరిన్ రావడానికి కేవలం అనారోగ్యం మాత్రమే కారణం కాకపోవచ్చు. కొన్ని సార్లు వాతావరణం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీరు సరిగ్గా గమనిస్తే వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. మరి ఇలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. వర్షాకాలంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడానికి కారణాలేంటి. ఇలా జరగడం వెనక అసలైన రీజన్స్ ఏంటి. ఈ వివరాలు తెలుసుకుందాం.ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కారణంగా యూరిన్ ఎక్కువగా వస్తుంటుంది. వర్షాకాలంలో బ్లాడర్ కండరాలు సంకోచానికి గురవుతాయి. ఇలా ప్రెజర్ పడడం వల్ల యూరిన్ కి వెళ్లాలన్న సంకేతాలు వస్తాయి. వెంటనే మీరు యూరిన్ పాస్ చేసి వస్తారు. ఒక్కోసారి బ్లాడర్ నిండకపోయినా సరే వాతావరణం చల్లగా ఉండడం వల్ల కండరాలు సంకోచిస్తాయి. అప్పుడు హీట్ పుట్టించేందుకు కండరాలు కదులుతాయి. ఈ ప్రక్రియ జరిగిన ప్రతిసారీ యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. 

బ్లాడర్ చాలా త్వరగా నిండిపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. అయితే..దీని వెనకాల మరో కారణం కూడా ఉంది. దీన్నే Cold diuresis అంటారు. అంటే..వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాడీ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇది. ఎక్కువ సమయం పాటు చలి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ కండీషన్ తలెత్తుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు రక్త నాళాలు సంకోచానికి గురవుతాయి. చర్మానికి తక్కువ రక్తం అందుతుంది.ర్మానికి సరైన విధంగా రక్త సరఫరా అందకపోతే అప్పుడు మిగతా అవయవాల చుట్టూ రక్తం చేరుకుంటుంది. అదే సమయంలో వేడి కూడా పుడుతుంది. సంకోచానికి గురైన రక్త నాళాల ద్వారానే రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. బీపీని తగ్గించడం కోసం కిడ్నీలు ఇంకాస్త ఎక్కువగా పని చేస్తాయి. ఈ ప్రాసెస్ లోనే యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా యూరిన్ ప్రొడ్యూస్ కాగానే బ్లాడర్ నిండిపోతూ ఉంటుంది. అలా తరచూ యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. సో దీని వెనకాల ఇంత సైన్స్ ఉందన్నమాట. అయితే..ఇలా పదేపదే యూరిన్ కి వెళ్లడం అనేది ఇబ్బంది కలిగించే విషయం. అయితే ఆ సమయంలో కాస్త వెచ్చగా ఉండే దుస్తులు వేసుకోవడం, చల్ల గాలిలో తిరగకపోవడం, బ్లాంకెట్ కప్పుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. వీటి వల్ల కొంతైనా యూరిన్ ఔట్ పుట్ తగ్గుతుంది. 




		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *