శృంగారం చేసేటపుడు దంపతులు ఎక్కువగా చేసే తప్పులేంటి తెలుసా..?

ఇరువురి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడే శృంగార జీవితాన్ని మరింత ఆశీర్వదించగలరు. శృంగారం అనేది ఒక మధురమైన అనుభూతి. ఇది వారిలోని ప్రేమానురాగాలను పెంచే ప్రక్రియ. శృంగారంవల్ల భూమిపై మనిషి మనుగడ కొనసాగుతుంది, అంతేగాక స్త్రీ, పురుషులు ఇద్దరిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం దోహదపడుతుంది.
అయితే కొందరు మార్కెట్లో దొరికే సంబంధిత కృత్రిమ లూబ్రికెంట్స్ కాకుండా కాస్మొటిక్ బాడీ లోషన్లను కూడా లూబ్రికెంట్స్‌గా వాడుతుంటారు. అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
కాస్మొటిక్స్లోని కృత్రిమ రసాయనాలు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఆలివ్ ఆయిల్‌ను కూడా లూబ్రికెంట్‌గా ఉపయోగిస్తుంటారు.
అది కూడా ప్రమాదకరమేనని సెక్సాలజిస్టులు అంటున్నారు. ఇలాంటి ఆయిల్ స్త్రీజననాంగాల్లో పేరుకుపోయి అనారోగ్యాలకు కారణమవుతుందని చెబుతున్నారు.

అదేవిధంగా శృంగార భంగిమల విషయంలో కూడా స్త్రీ, పురుషులు అతి చేయకూడదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. అశ్లీల చిత్రాలు చూసి వాటిలో కనిపించే అన్ని రకాల భంగిమలను ప్రయత్నిస్తే చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
అలాంటి సినిమాలు చేసేవాళ్లు కొత్తదనం కోసం విపరీత భంగిమలు చూపిస్తారని, కానీ అవన్నీ అందరూ చేయగలిగినవి కావని చెబుతున్నారు. స్త్రీ, పురుషుల వయసు, శరీర బరువులను బట్టి అనువైన భంగిమలు మాత్రమే ప్రయత్నించడం ఉత్తమమని సూచిస్తున్నారు.
రతిక్రీడకి ముందు ఒక గ్లాసు దానిమ్మ జ్యూసు తాగితే, రక్తప్రసరణ సరిగ్గా జరిగి, ఉత్సాహాన్ని పెంచుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగి, పడకగదిలో రెచ్చిపోతారు. చాక్లెట్..దీని గురించి చెప్పాల్సిన పనిలేదు.

News by : V.L
