రోజూ పళ్ళు తోమడంలో చాలా మంది చేస్తున్న తప్పులేంటో తెలుసా, సరిగ్గా బ్రష్ ఎలా చేయాలో చెబుతున్న డెంటిస్ట్

నోటి శుభ్రత అనేది చాలా ముఖ్యం. దీనికోసం మనం రోజూ బ్రష్ చేస్తుంటాం. కానీ, సరిగ్గానే చేస్తున్నామా అంటే లేదనే చెబుతున్నారు డెంటిస్ట్. చాలా మంది తెలియక నూటికి 90 శాతం మంది నోటి పరిశుభ్రతని కాపాడుకోలేకపోతున్నారని, దీని వల్ల సమస్యలొస్తాయని చెబుతున్నారు. అలా కాకుండా నోటి పరిశుభ్రతని కాపాడుకునేందుకు సరైన విధంగా ఎలా బ్రష్ చేయాలో చెబుతున్నారు డెంటిస్ట్ డాక్టర్ సెహగల్.
నోరు బాగుంటే ఊరు బాగుంటుందనేది పాత సామెత.. దాన్నే కాస్తా హెల్త్ విషయానికి అన్వయిస్తూ చెప్పాలంటే నోరు బాగుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనకి వచ్చే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నోరు శుభ్రంగా లేకపోవడం వల్లే వస్తాయి. అందులో హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి షుగర్, షుగర్, డెమెన్షియా వరకూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి చెక్‌పెట్టేందుకు చక్కగా నోటిని క్లీన్ చేసుకోవాలి. అందుకే, రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని చెబుతారు. రెండు సార్లు చేసుకోమన్నారు కదా అని గబగబా తోమి క్లీన్ చేయడం కాదు. సరైన విధంగా తోమాలని చెబుతున్నారు డెంటిస్ట్ సెహగల్.
పళ్ళు తోమడంలో 3 తప్పులు
చాలా మంది పళ్ళు తోమామంటే తోమేస్తున్నారు. కానీ, అలా చేస్తే కాదు, సరైన విధంగా తోమాలి. ముఖ్యంగా పళ్ళు తోమేటప్పుడు 3 మిస్టేక్స్ చేస్తున్నారు. వీటిని అవాయిడ్ చేయాలి. దీంతో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసుకోవచ్చు. మరి ఆ మిస్టేక్స్ ఏంటంటే
దంతాలు, చిగుళ్ళ మధ్య
చాలా మంది చేసే తప్పుల్లో ఒకటి. దంతాలు, చిగుళ్ళని బ్రష్ చేస్తారు. కానీ, మధ్యలో ఉన్న జంక్షన్‌ని మిస్ చేస్తారు. అలా చేయొద్దు. దీని వల్లే అక్కడ ప్లేక్ ఏర్పడుతుంది. బ్యాక్టీరియా పెరిగి దంత సమస్యలు, గమ్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా దంత ఆరోగ్యమే పాడైపోతుంది. దంతాలు, చిగుళ్ళ మధ్య కూడా తోమాలి.
నాలుకని క్లీన్ చేయడం
కొంతమంది దంతాలను మాత్రమే క్లీన్ చేస్తారు. నాలుకని పట్టించుకోరు. కానీ, ప్రతిరోజూ నాలుకని కూడా క్లీన్ చేయాలి. దీని వల్ల పాచి ఏర్పడదు. బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి పెరగకుండా ఉంటాయి. నాలుకని క్లీన్ చేస్తే బ్యాక్టీరియా, ఈస్ట్ పెరగకుండా ఉండడమే కాకుండా దుర్వాసన కూడా రాదు.
జ్ఞాన దంతాలని క్లీన్ చేయడం
డాక్టర్ సురీనా సెహగల్ ప్రకారం, రోజూ దంతాలను మాత్రమే కాదు, జ్ఞాన దంతాలను కూడా క్లీన్ చేయాలి. చాలా మందికి, అవి ఉంటాయనే తెలియవు. కానీ, వీటిని కూడా చక్కగా క్లీన్ చేయాలి. లేదంటే అవి పాడైపోయి ఇతర దంతాలకి కూడా ఆ సమస్య సోకే అవకాశం ఉంది. కాబట్టి, కచ్చితంగా వాటిని కూడా క్లీన్ చేయాలి. దీనికోసం మరో ప్రత్యేకమైన బ్రష్ వాడడం మంచిది.
