మీకూ ఈ లక్షణాలు ఉన్నాయా? కీళ్లవాతం కావొచ్చు… అస్సలు ఇవి తినకండి

కీళ్లవాతం అనేది కీళ్లలో నొప్పి, వాపుతో కూడిన వ్యాధి. మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల అనేకమంది కీళ్లవాతం బారిన పడుతున్నారు. డాక్టర్ జ్యోతి ప్రకారం, ఆయుర్వేదంలో మెరుగైన చికిత్సలు ఉన్నాయి. కీళ్లవాతం అనేది కీళ్లలో వచ్చే ఒక రకమైన నొప్పి, వాపుతో కూడిన ఒక వ్యాధి. దీనిని ఆయుర్వేదంలో ఆమవాతం అని కూడా అంటారు. ఇది కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతుంది. ఇది శరీరంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నడవడానికి, కూర్చోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం ఇతర కారణాల వల్ల అనేకమంది కీళ్లవాతం బారిన పడుతున్నారు. కీళ్లలో నొప్పి, వాపు, దృఢత్వం, కదలికలో ఇబ్బంది, కొన్నిసార్లు అలసట ఇవన్నీ కీళ్లవాతం లక్షణాలుగా గుర్తించాలని వరంగల్ నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి వెల్లడించారు.
కీళ్లవాతంలో కీళ్ల నొప్పులు తీవ్రంగా లేదా తేలికపాటిగా ఉండవచ్చు. కీళ్లు వాచి ఎర్రగా మారడం లేదా వేడిగా ఉండడం జరుగుతుంది. కీళ్లను కదిలించడంలో ఇబ్బంది కలగడం లేదా పూర్తిగా కదలకపోవడం జరగవచ్చు. కొన్ని రకాల కీళ్లవాతంలో చర్మం రంగు మారడం లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత కీళ్లు పట్టేసినట్లు అనిపించడం, కదలిక కష్టంగా ఉండడం ఇవన్నీ కీళ్లవాతం లక్షణాలుగా గుర్తించాలి. ఆయుర్వేదంలో (కీళ్లవాతం) ఆమవాతానికి మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆమవాతంతో బాధపడుతున్న వారికి ఇంటర్నల్ మెడికేషన్, పంచకర్మ చికిత్సలు చేస్తారు. ఈ చికిత్సల ద్వారా ఈ వాతం నయమయ్యే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
