ఇవి మీ ఇంట్లో ఉన్నాయా.. జాగ్రత్త పాములు వేగంగా వచ్చేస్తాయి మరి!

మంచి సువాసన గల మొక్కలు ఇంటి చుట్టూ ఉండకుండా చూసుకోవాలంట. ఎందుకంటే సువాసన వెదజల్లుతూ పుష్పించే మొక్కలు మీ ఇంటి ఆవరణంలో ఎక్కువ ఉన్నట్లు అయితే పాములు మీ ఇంటి వద్దకు ఎక్కువగా వస్తాయంట. ముఖ్యంగా మల్లెపూలు, చామంతి పువ్వులు, సన్నజాజి మల్లెపువ్వులు,కుకుమ పువ్వు మొక్కలు,పువ్వులు అంటే పాములకు చాలా ఇష్టం అంట. ఇవి ఉన్నదగ్గర తప్పక పాములు ఉంటాయంటున్నారు నిపుణులు.
కొందరు ఎరువుల కోసం, సేంద్రీయ ఎరువుల కోసం తోటల్లో ఆకులను కుప్పులుగా పోస్తుంటారు. అయితే అలాంటి ప్లేసెస్‌లో కూడా పాములు ఎక్కువగా ఉంటాయంట. ముఖ్యంగా కుళ్లిపోయిన చెత్తా చెదారం వద్ద ఎలుకలు, కీటకాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటిని తినడం కోసం పాములు కూడా అక్కడకి వస్తుంటాయి. అందుకే ఇంటి చుట్టూ పోగు చేసిన చెత్త ఉండకూడదంట.
చాలా మంది ఇంటి చుట్టూ అందమైన మొక్కలు, చిన్న చిన్న సరస్సులుగా చేసి అందమైన లోటాస్ పూల తోటలను పెంచుకుంటారు. అయితే ఈ చిన్ని చిన్న నీటి సరస్సుల్లో కప్పలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాటి కోసం, అలాగే పూల సువాసన కోసం పాములు వస్తాయి, అవి పాములను ఆకర్షిస్తాయంట. అందువలన ఇంటి చుట్టూ చిన్న చిన్న నీటి సరస్సులు ఉంటే చాలా జాగ్రత్త పడాలంట,
ఇంటి చుట్టూ తీగలాగా పెరిగే మొక్కలు కూడా ఉండకూడదంట. ముఖ్యంగా ఇంగ్లీష్ ఐవీ లేదా పెరివింకిల్ వంటి నేలపై దట్టంగా పెరిగే గడ్డి పాములను ఎక్కువగా ఆకర్షిస్తాయంట. ఆ మొక్కలు పాములకు చల్లటి వాతావరణాన్ని అందిస్తాయి. అందువలన అందులో ఉండటానికి పాములు ఎక్కువగా ఇష్టపడతాయంట. అలాగే వాటి ఆహారం, కీటకాలకుదాక్కునే ప్రదేశాలను అందిస్తాయి.
దట్టమైన చెట్లు, బెర్రీ పొదలు చిన్న జంతువులు, పక్షులు,కీటకాలను ఆకర్షిస్తాయి. ఇవి పాములకు ఆహారంగా మారుతాయి.అందరుకే ఎత్తైన గడ్డిగా ఉన్న మొక్కలు ఇంటి చుట్టూ ఉంటే వాటిని తొలిగించాలని, అవి పాములకు మంచి నివాసం అని చెబుతున్నారు నిపుణులు.

