మీకు దంత సమస్యలు ఉన్నాయా ? ఈ చికిత్స తీసుకోండి

శరీర ఆరోగ్యానికి ముఖద్వారం నోరే. ఆహారాన్ని తినేటప్పుడు, రకరకాల పానీయాలను తాగేటప్పుడు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వాటి ప్రభావం దంతాలపై పడుతుంటుంది. దీంతో దంతాల సమస్యల వల్ల పళ్లల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
హైలైట్:
- దంత సమస్యల కారణంగా తీవ్ర అసౌకర్యం
- సమస్య పరిష్కారానికి అత్యాధునిక లేజర్ ట్రీట్మెంట్
అన్ని శరీరభాగాల్లో దంతాలకు వచ్చే సమస్యలు అంతవేగంగా తగ్గవు. దంతాలు ఆరోగ్యంగా లేకుంటే అవి మరికొన్ని శారీరక అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. దంత సమస్యలు నిత్య జీవితంలో తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయి. ప్రాణం పోతుందా..? అన్నంత బాధను కలిగిస్తాయి. ఈ సమస్యలు చాలా రకాలున్నాయి. అవి కొన్ని స్వల్పకాలికమైనవైతే, మరికొన్ని దీర్ఘకాలికమైనవి. వీటిలో కొన్ని తగిన పరిశుభ్రత పాటించక పోవడం వల్ల వస్తే.. మరికొన్ని దంత సంరక్షణలో నిర్లక్ష్యం వల్ల వస్తాయి. ఇంకొన్ని సమస్యలు ప్రమాదవశాత్తూ వస్తుంటాయి.
నేటి సమాజంలో పంటినొప్పికి గురికాని వారంటూ సర్వసాధారణంగా ఉండరు. పంటినొప్పితో పాటు దవడలు వాయడం, మాట్లాడడానికి, ఏమీ తినడానికి వీలుకాకపోవడం. విపరీతమైన నొప్పి, జ్వరం ఇతర సమస్యలూ చాలామందిలో ఎక్కువగా కన్పిస్తాయి. అయితే దంత సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్ బెస్ట్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు.

షుగర్ పేషెంట్స్.. ఈ పిండితో చేసిన రోటీ తింటే మంచిదట..
అత్యాధునిక లేజర్ చికిత్స
దంత, నోటి సమస్యలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్స లేజర్ చికిత్స. ఇది తక్కువ ఖర్చుతోనే జరుగుతుంది. ‘లేజర్ డెంటిస్ట్రీ’ అనే ప్రత్యేక పరికరం ద్వారా ఈ చికిత్స చేస్తారు. లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై సిమ్యులేషన్ ఎమిజన్ ఆఫ్ రేడియేషన్.

News by : V.L
