రాత్రి పూట వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. తిన్నారో మీ ఆరోగ్యం మటాష్..

చాలా మంది ఉదయం, మధ్యాహ్నం చాలా తక్కువ తిని.. రాత్రి పూట మాత్రం ఓ పట్టు పడుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. రాత్రి వేళల్లో ఏం తినాలి, తినకూడదు అనే అవగాహన ఉండాలంటున్నారు.
ఆహారం నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ఏది తిన్నా, ఏ సమయంలో తిన్నా అది ఆరోగ్యంపైనే ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే సరైన సమయంలో.. సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఉదయం పూట భారీగా బ్రేక్ ఫాస్ట్, రాత్రి సమయాల్లో తేలికపాటి భోజనం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, చాలా మంది ఎలా పడితే అలా తింటున్నారు. దీంతో లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏం సమయంలో ఏం తింటే ఆరోగ్యానికి మంచిదో పూర్తి అవగాహన ఉండాలి.
చాలా మంది ఉదయం, మధ్యాహ్నం చాలా తక్కువ తిని.. రాత్రి పూట మాత్రం ఓ పట్టు పడుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. రాత్రి వేళల్లో ఏం తినాలి, తినకూడదు అనే అవగాహన ఉండాలంటున్నారు. ఈ అవగాహన లేకపోతే.. జీర్ణ సమస్యలు, నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కడుపు ఆరోగ్యంగా, తగినంత నిద్ర ఉంటే రోగాలు మీ దరి చేరవు. అయితే, రాత్రి తినే ఆహారం ఈ రెండింటిపై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రి వేళ తినే ఆహారంపై జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫుడ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి పూట తినకూడదు. ఆ ఫుడ్స్ లిస్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాత్రి సమయాల్లో కెఫిన్ కలిగిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. సోడా, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. కొన్ని ఐస్ క్రీమ్స్, డిస్టర్స్లో కూడా కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఎక్కువ తీసుకుంటే మీ సిర్కాడియన్ సైకిల్‌కు పూర్తిగా అంతరాయం కలుగుతుంది. అంటే మీ నిద్రకు భంగం కలుగుతుందని అర్థం. కెఫిన్ మెదడుని యాక్టివ్ చేస్తుంది. దీంతో సరిగ్గా నిద్ర పట్టదు. అంతేకాకుండా రాత్రి పూట జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీంతో.. కెఫిన్ వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
స్వీట్స్/చాక్లెట్స్..చాలా మంది రాత్రి పూట డిన్నర్ తర్వాత.. స్వీట్స్ లేదా చాక్లెట్ తింటుంటారు. అయితే, ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. దీంతో.. రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఎటువంటి ఉపయోగం లేని అదనపు శక్తి ఉత్పత్తి అవుతుంది. దీంతో.. కొవ్వు బర్న్ కాదు. దీంతో.. బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే రాత్రి వేళల్లో స్వీట్స్, చాక్లెట్ వంటి పదార్థాల జోలికి పోకూడదంటున్నారు నిపుణులు.

