DMart: డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా ? అక్కడ కొన్న వస్తువులను రిటర్న్ లేదా ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చా ? ఇది తెలియకుండా వెళ్లకండి …
Dmart: వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మంది డీమార్ట్ స్టోర్‌కి వెళ్తుంటారు. సరదగా కుటుంబమంతా కలిసి అలా డీమార్ట్‌కి వెళ్లి.. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని వస్తారు. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనే ఆప్షన్ ఉన్నాసరే.. ఇప్పటికీ కొంతమంది డీమార్ట్ కు వెళ్లి షాపింగ్ చేస్తారు.డీమార్ట్ (DMart).. డీమార్ట్.. డీమార్ట్. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్యామిలీ మొత్తం షాపింగ్ కోసం ఇక్కడికి వాలిపోతుంది. ఇంకా చెప్పాలంటే, చాలా మందికి ఇదొక పిక్నిక్ స్పాట్ లాంటిది. సరదగా కుటుంబమంతా కలిసి అలా డీమార్ట్‌కి వెళ్లి.. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని వస్తారు. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనే ఆప్షన్ ఉన్నాసరే.. ఇప్పటికీ కొంతమంది డీమార్ట్ కు వెళ్లి షాపింగ్ చేస్తారు. ఇక్కడ దొరికే డిస్కౌంట్లు కూడా అలాగే ఉంటాయనుకోండి.ఇప్పుడు ప్రధాన నగరాలతో పాటు, ముఖ్యమైన పట్టణాల్లో సైతం డీమార్ట్ బ్రాంచీలు వెలిసాయి. ఇంటి దగ్గర కిరాణా షాపుల్లో కొనే బదులు.. ఇక్కడ కొంటే కాస్త డిస్కౌంట్ అయినా వస్తుందని చాలా మంది వెళ్తుంటారు. అంతేకాకుండా.. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతుండడంతో ప్రజలు డీమార్ట్‌కు వెళ్లి.. షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు.ఇక మనం కొన్న వస్తువులకు బిల్లింగ్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఐతే, మనం కొన్న వస్తువుల్లో ఏదైనా డామేజ్ ఉన్నా, లేదా మనకు నచ్చకపోయినా.. ఆ వస్తువులను రిటర్న్ చేయొచ్చా..? అనే డౌట్ చాలా మందికి ఉండే ఉండుంటుంది. మరి డీమార్ట్ పాలసీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రిటర్న్/ఎక్స్ఛేంజ్ (Offline Dmart Stores Return/exchange policy):
డీమార్ట్ స్టోర్‌లలో (DMart Stores) రిటర్న్‌లు లేదా ఎక్స్ఛేంజ్ ఇచ్చే ఆప్షన్ ఉండదు. మీరు ఒక్కసారి డీమార్ట్ నుంచి ఏదైనా వస్తువు కొంటే.. దాన్ని తిరిగి ఇవ్వలేరు లేదా ఎక్స్ఛేంజ్ చేయలేరు. కస్టమర్ల నుండి వచ్చే కొన్ని సాధారణ ఫిర్యాదులను పరిశీలిస్తే.. కస్టమర్లు ఆహార వస్తువులను లేదా డైపర్‌ల వంటి వస్తువులను తిరిగి ఇవ్వడానికి వస్తారని తెలిసింది. కానీ డీమార్ట్ మేనేజ్మెంట్ వాటిని రిటర్న్ తీసుకోవు. దీంతో కస్టమర్లకు నిరాశ తప్పదు.ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రిటర్న్/ఎక్స్ఛేంజ్ (Offline Dmart Stores Return/exchange policy):
డీమార్ట్ స్టోర్‌లలో (DMart Stores) రిటర్న్‌లు లేదా ఎక్స్ఛేంజ్ ఇచ్చే ఆప్షన్ ఉండదు. మీరు ఒక్కసారి డీమార్ట్ నుంచి ఏదైనా వస్తువు కొంటే.. దాన్ని తిరిగి ఇవ్వలేరు లేదా ఎక్స్ఛేంజ్ చేయలేరు. కస్టమర్ల నుండి వచ్చే కొన్ని సాధారణ ఫిర్యాదులను పరిశీలిస్తే.. కస్టమర్లు ఆహార వస్తువులను లేదా డైపర్‌ల వంటి వస్తువులను తిరిగి ఇవ్వడానికి వస్తారని తెలిసింది. కానీ డీమార్ట్ మేనేజ్మెంట్ వాటిని రిటర్న్ తీసుకోవు. దీంతో కస్టమర్లకు నిరాశ తప్పదు.DMart రెడీ – DMart Ready (ఆన్‌లైన్/హోమ్-డెలివరీ) విధానం
DMart ఆన్‌లైన్ హోమ్ డెలివరీ సర్వీస్ (dmart online home delivery service) అయిన DMart రెడీ (DMart Ready) వేరే పాలసీ అనుసరిస్తుంది. మనం కొన్న వస్తువులను రిటర్న్ చేయడం అనేది.. ఆన్‌లైన్ కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఏదైనా వస్తువును 7 రోజుల్లోపు DMart రెడీ సోర్స్ లేదా పికప్ పాయింట్‌కు తిరిగి ఇవ్వవచ్చు. అయితే, ఎక్స్‌చేంజ్ చేయడానికి వీలులేదు. మీరు ఏదైనా వస్తువును ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే.. మీరు దానిని తిరిగి ఇచ్చి, తర్వాత కొత్త ఆర్డర్ చేయాలి. కానీ ఆ వస్తువును యూజ్ చేయకుండా ఉండాలి. ఒకసారి వాడిన వస్తువును వారు తీసుకోరు. ఒరిజినల్ ప్యాకేజింగ్‌తో పాటు వోచర్-లింక్డ్ బిల్లుతో (voucher-linked bill) ఉండాలి. 3 నుంచి 5 వర్కింగ్ డేస్‌లో రీఫండ్ వస్తుంది.కొన్ని వస్తువులు రిటర్న్‌కు అర్హత ఉండవు
తాజా ఆహార పదార్థాలు (పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు). అలాగే, లోదుస్తులు, సాక్స్, మేజోళ్ళు, సౌందర్య సాధనాలు (Cosmetics), పండుగ సంబంధిత వస్తువులు, బల్క్ కొనుగోళ్లు, కొన్ని ఇతర వస్తువులకు రిటర్న్ ఉండదు. వీటి పూర్తి వివరాల జాబితా DMart రెడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

