DMart: Are you buying on the off chance that there are offers at DMart? If you know this, you will benefit beyond the discount!

డీమార్ట్‌లో నిత్యం వేల మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అదిరే డీల్స్ ఇందుకు కారణం కావొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం.డీమార్ట్ గురించి మనకందరికీ తెలుసు. చాలా మంది ఇందులో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లోకి కావాల్సినవి కొంటూ ఉంటారు. ఒకటి కొంటే మరొకటి ఉచితం, అదిరే తగ్గింపు వంటి పలు రకాల ఆఫర్లు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ఇందులో షాపింగ్ చేస్తారు. కొందరు అయితే అక్కడికి వెళ్లి షాపింగ్ చేసేటప్పుడు అవసరం లేకున్నా భారీ తగ్గింపు నేపథ్యంలో కొనే వాళ్లు కూడా ఉండొచ్చు.అయితే డీమార్ట్‌లో షాపింగ్ చేసే వారు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనలా కొనే వాళ్లు పెరిగే కొద్ది కంపెనీ షేర్లపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకే మీరు డీమార్ట్ షేర్ల గురించి కూడా ఆలోచించొచ్చు. ఈ క్రమంలో డీమార్ట్ షేర్లు కొనాచ్చా? లేదా? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.DMart టెక్నికల్ వ్యూ చూస్తే రేంజ్ బౌండ్‌లో ఉంది. రోజువారీ చార్టులో 50-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కిందకు పడిపోయింది. అదనంగా ఇది మార్చి 3 , జూన్ 10 నాటి స్వింగ్ కనిష్ట స్థాయిలను కలుపుతూ డౌన్‌వర్డ్ స్లోపింగ్ ట్రెండ్‌లైన్‌కు దగ్గరగా ట్రేడవుతోంది.రాబోయే సెషన్ల కోసం, వ్యాపారులు 50-రోజుల EMA , ట్రెండ్‌లైన్ చుట్టూ DMart ధర చర్యను పర్యవేక్షించవచ్చు. ట్రెండ్‌లైన్ , 50-రోజుల EMA కింద షేరు ధర క్లోజ్ అయితే అది బలహీనతను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా ఇక్కడ ఒక సానుకూల అంశం కూడా ఉంది. బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాట్రన్ ప్రకారం చూస్తే.. కీలకమైన మద్దతు జోన్ నుండి షేరు ధర పైకి కదిలింది. సూచిస్తుంది.ఆప్షన్స్ డేటా చూస్తే.. DMart జూలై 31 ఎక్స్‌పైరీ డేటా గమనిస్తే 4,200 స్ట్రైక్ వద్ద గణనీయమైన కాల్ అండ్ పుట్ ఓపెన్ ఇంటరెస్ట్ (OI)ని చూసింది, ఇది ఈ జోన్ చుట్టూ రేంజ్‌బౌండ్ కదలికను సూచిస్తుంది. అదనంగా 4,500 స్ట్రైక్ వద్ద అత్యధిక కాల్ బేస్ కూడా కనిపించింది, ఇది ఈ జోన్ వద్ద DMart షేరకు నిరోధాన్నిసూచిస్తుంది.సీఎల్ఎస్ఏ ప్రకారం చూస్తే.. ఈ షేరు‌కు ఔట్‌ఫర్ఫార్మ్ రేటింగ్ ఉంది. షేరు ధర ఏకంగా రూ. 5549కు చేరొచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుతం డీమార్ట్ షేరు ధర రూ.4064 వద్ద ఉంది. అంటే ప్రస్తుత ధర ప్రకారం చూస్తే.. దీర్ఘకాలంలో షేరు ధర రూ.1500 మేర పైకి చేరొచ్చు. అయితే మెక్వైరీ, మోర్గాన్ స్టాన్లీ అయితే ఈ షేరుకు అండర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చాయి. షేరు ధర రూ.3 వేల నుంచి రూ.3,200 పడొచ్చని అంచనా వేశాయి.కాగా డీమార్ట్ వ్యాపారాన్ని గమనిస్తే..2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ రెవెన్యూ రూ. 15,932 కోట్లుగా నమోదు అయ్యింది. వార్షికంగా చూస్తే 16 శాతం పెరిగింది. అయితే డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలు అందుకోలేకపోయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ప్రతికూల అంశమనే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే కంపెనీ స్టోర్ల సంఖ్య 424గా ఉంది. కంపెనీ క్రమక్రమంగా స్టోర్ల సంఖ్యను పెంచకుంటూ వెళ్తోన్న విషయం మనకు తెలిసిందే. 




















		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *