దీపావళి 2025 ధన త్రయోదశి, నరక చతుర్దశి, దివాళి ఫెస్టివల్ ఏ రోజు ఏ పండుగ జరుపుకోవాలంటే?

Deepavali 2025 భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పత్రిబింబాలు పండుగలు (Festivals 2025). అలాంటి అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ (Diwali 2025) ఒకటి. కుల మత వర్గ ప్రాంత పేద ధనిక విభేదాలు లేకుండా జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి యేటా ఈ పండుగను 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తొలి మూడు రోజులు ధన త్రయోదశి (Dhanteras 2025), నరక చతుర్దశి (Naraka Chaturdashi 2025), దీపావళి (Diwali Festival 2025) వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ పండుగలు ఏ రోజున జరుపుకోవాలో తెలుసుకుందాం..
ధన త్రయోదశి (Dhanteras 2025) – అక్టోబర్ 18 శనివారంఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున త్రయోదశి తిథి మద్యాహ్నం 12.18 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 19 మధ్యాహ్నం 1.51 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున బంగారం, వెండి లేదా ఏదైనా కొత్త వస్తువులు, ఆస్తులు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా బంగారం, వెండి ఆభరణాలను లక్ష్మీదేవి పూజ సమయంలో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. ఆయుర్వేదానికి ఆద్యుడు, దేవ వైద్యుడు, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి అమృత కలశంతో ఆవిర్భవించిన రోజు కాబట్టి ధనం, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ప్రధానంగా ధన్వంతరి పూజ ఆచరిస్తారు.
నరక చతుర్దశి (Naraka Chaturdashi 2025) – అక్టోబర్ 19 ఆదివారంఈ ఏడాది చతుర్దశి తిథి అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:51 గంటలకు మొదలై అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. ఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశి రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం ఆచరిస్తే దోషాలు తొలగిపోతాయని చెబుతారు. మన పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం చతుర్దశి తిథి రోజు శ్రీకృష్ణుడు, సత్యభామ సమేతుడై నరకాసురుడిని వధించాడు. దీంతో ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. దీన్నే చోటి దీపావళిగా జరుపుకుంటారు.

