Dhanteras 2025: ధన త్రయోదశి రోజున ఉప్పు తో ఈ పరిహారాలు చేయండి.. ఆరోగ్యం, సంపదకు లోటు ఉండదు..

జ్యోతిష్యం ప్రకారం ధన త్రయోదశి రోజున పూజలతో పాటు ప్రత్యేక ఆచారాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఆచారాలు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి. ఆనందం, శ్రేయస్సును పెంచుతాయి. ఇంట్లో సుఖ సంతోషాల కోసం ధన త్రయోదశి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం ఫలవంతం. వాటి గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో పదమూడవ రోజు త్రయోదశి తిథి (చీకటి పక్షం)ని ధన్ తేరాస్ పండుగను జరుపుకుంటారు. దీనిని ధన త్రయోదశి అని కూడా అంటారు. ఈ శుభ సందర్భంగా లక్ష్మీదేవి, కుబేరుడిని, ధన్వంతరి దేవిని పూజించడం ఆచారం. ఈ రోజున వీరిని పూజించడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది. బంగారం , వెండి ఆభరణాలు, కొత్త పాత్రలు కూడా ఈ రోజున కొనుగోలు చేస్తారు.ధన్ తేరస్ నాడు పూజలు, ప్రార్ధనలు, ఆచారాలతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు కూడా ఆచరించడం మంచిదని జ్యోతిష్యం సూచిస్తుంది. ఈ చర్యలు ఆర్థిక ఇబ్బందులను తగ్గించి.. ఆనందం , శ్రేయస్సును పెంచుతాయి. ధన్ తేరస్ రోజున ఉప్పు సంబంధిత నివారణలు సూచించబడ్డాయి. అవి ఏమిటంటే..ధన్ తేరస్ ఎప్పుడు? వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శ్వయుజ మాసం త్రయోదశి తిథి అక్టోబర్ 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:51 గంటల వరకు ఉంటుంది. కనుక ఉదయం తిథి ప్రకారం ధన్ తేరస్ ను అక్టోబర్ 18న జరుపుకుంటారు.
ధన్ తేరస్ నాడు ఉప్పు నివారణలు
- వాస్తు దోషాలను తొలగించుకోవడానికి ధన్ తేరస్ నాడు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంటికి ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.
- ధన్ తేరస్ నాడు ఉప్పు కొనడం శుభప్రదం. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. భక్తునికి ఆమె తన ఆశీస్సులను కురిపిస్తుంది. ఇంటికి ఆనందం, అదృష్టాన్ని తెస్తుంది.
- ధన్ తేరస్ నాడు ఉప్పుతో లావాదేవీలు చేయడం నిషేధించబడింది. జ్యోతిష్కుల ప్రకారం ఈ రోజున ఉప్పు లావాదేవీలను నివారించాలి. పొరపాటున కూడా ఈ రోజున ఉప్పును అప్పుగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు.
- ధన్తేరస్ రోజున దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కనుక ఈ రోజున ఒకరి ఆర్థిక స్థితికి అనుగుణంగా డబ్బు , ఆహారాన్ని దానం చేయాలి.
- ధన్తేరస్ నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కలిపిన నీటిని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల దుఃఖం, పేదరికం దూరమవుతాయి.

