రాముడిపై భక్తి.. 1,338 కి.మీ దూరం నడిచి అయోధ్యకు వెళ్లిన వృద్ధుడు

గుజరాత్ నుంచి అయోధ్య వరకు మొత్తం 1338 కిలోమీటర్ల మేర నడిచి, అయోధ్యలోని రాముడి దర్శనం చేసుకున్నాడు.
అందుకే మన సంస్కృతిలో రాముడు వేలాది సంవత్సరాలుగా భాగమై పోయాడు. దేశంలో రాముడి గుడి లేని గ్రామం, ఆయన పేరు వినిపించని ఇల్లు ఉండవన్నంతగా రాముడు మనకు ఆదర్శ ప్రాయుడయ్యాడు. అలాంటి రామయ్య మీద భక్తితో గుజరాత్‌లోని ఓ వృద్ధుడు చేసిన సాహసం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. శ్రీరాముడిపై భక్తితో 73 ఏళ్ల ఓ వృద్ధుడు మూడు దశాబ్దాల క్రితం సంకల్పం చేసుకున్నారు. ఇన్నేళ్లకు దాన్ని సాకారం చేసుకొని మొక్కు చెల్లించుకున్నారు.హర్జీవన్ దాస్ పటేల్ స్వస్థలం గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని మోడీపూర్ గ్రామం. 1990 అక్టోబర్ లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ రథయాత్రలో కూడా పూర్తి ఉత్సాహంతో పాల్గొన్నాడు. శ్రీరాముడిపై అచంచలమైన భక్తి విశ్వాసాలున్న 73 ఏళ్ల లాల్ హర్జీవన్ దాస్ పటేల్.. పాదయాత్ర చేసి అయోధ్య వెళ్లాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే.. గుజరాత్ నుంచి అయోధ్య వరకు మొత్తం 1338 కిలోమీటర్ల మేర నడిచి, అయోధ్యలోని రాముడి దర్శనం చేసుకున్నాడు. ప్రతి రోజూ 35 కిలోమీటర్ల మేర నడిచి, ఓ చోట విశ్రాంతి తీసుకునేవారు. ఆగస్టు 30 న ప్రారంభమైన ఈ పాదయాత్ర 40 వ రోజు అయోధ్యలో ముగిసింది. దారి పొడవునా వున్న దేవాలయాలు, పబ్లిక్ పార్కులు, అతిథి గృహాలలో ఆగేవారు.అలాగే ముందు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో అతని బంధువులు మొబైల్స్ ఆధారంగా చెప్పేవారు. చివరికి తాను అయోధ్యకు చేరుకున్నానని, సంకల్పం పూర్తైందని, జన్మ ధన్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.

