Dengue fever is spreading in Telugu states.. If you don’t follow these precautions, you will die!

వర్షాకాలం అంటేనే సీజనల్‌ వ్యాధులు భయపెడుతుంటాయి. వర్షాలతో కొత్త నీరు రాక, దోమల కారణంగా ప్రజలు ఎక్కువగా వ్యాధుల బారినపడుతుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో అధికారికంగా వందల కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు నిర్ధారణ అయింది.దోమ కాటువల్ల వచ్చే డెంగ్యూ జ్వరం సోకితే అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. డెంగ్యూ వ్యక్తులు సరైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమయానుకూలంగా చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూ జ్వరం ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం సమయంలో దాడి చేస్తాయి. ఈ దోమలు నీరు నిల్వ ఉన్న స్థలం, చెత్త, డ్రైనేజీ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరంతో పాటు తీవ్రమైన డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్‌గా మారే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. ఇది ప్రాణాంతకమవుతుంది కాబట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. .డెంగ్యూ జ్వరం సోకిన తర్వాత నాలుగు నుంచి 10 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, కళ్ల వెనుక నొప్పి, చర్మంపై దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ (DHF)లో ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తపోటు తగ్గడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటివి జరిగి ప్రాణాంతకం కావచ్చు అంటున్నారు వైద్యులు. లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరుతున్నారు.

డెంగ్యూ నిర్ధారణకు NS1 యాంటిజెన్ టెస్ట్, IgM యాంటీబాడీ టెస్ట్ చేయిస్తారు. చికిత్సలో పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువగా నీరు తాగాలి. ORS వంటి ద్రవణాలు తీసుకుంటూ ఉండాలి. వైద్యుల సలహా మేరకు జ్వరం, నొప్పి ఉన్నప్పుడు సూచించిన మాత్రలు తప్పనిసరిగా వాడాలి.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *