Dementia: చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుండట్లేదా?.. అది సాధారణ మతిమరుపు కాదు, డిమెన్షియా కావచ్చు!

కొన్నిసార్లు ఈ మెదడు పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో డిమెన్షియా (Dementia) ఒకటి. మనిషి మెదడు ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన, విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం వంటి అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. అయితే, కొన్నిసార్లు ఈ మెదడు పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో డిమెన్షియా (Dementia) ఒకటి. దీన్ని మతిమరపుగా భావిస్తారు. cడిమెన్షియా అనేది ఒక కచ్చితమైన వ్యాధి అని చెప్పలేం. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, సామాజిక నైపుణ్యాలను తీవ్రంగా ప్రభావితం చేసే లక్షణాలు అన్నింటినీ కలిపి వివరించడానికి ఉపయోగించే పదం ఇది.సాధారణంగా డిమెన్షియా వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ యువతకుకూడా రావచ్చు. 65 ఏళ్ల లోపు ఏజ్ గ్రూప్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే, దాన్ని ‘యంగ్ ఆన్సెట్ డిమెన్షియా’ అంటారు. కొన్ని సందర్భాల్లో 30 లేదా 40 ఏళ్ల వయసు నుంచే దీని సంకేతాలు కనిపించొచ్చు. డిప్రెషన్ అని పొరపాటు
యంగ్-ఆన్సెట్ డిమెన్షియా (Young-onset dementia) 65 సంవత్సరాల లోపు వ్యక్తులలో వస్తుంటుంది. కొన్నిసార్లు 30 లేదా 40 ఏళ్ల వయసు నుంచే దీని సంకేతాలు కనిపించవచ్చు. డిమెన్షియాను చాలా మంది యువకులు ఒత్తిడి, డిప్రెషన్ లేదా బర్న్అవుట్ అని పొరపాటు పడుతుంటారు. దీనివల్ల ఎర్లీ సింప్టమ్స్‌ను గుర్తించడం కష్టం. ఫలితంగా వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుంది. మరి టైమ్‌కు ట్రీట్మెంట్ అందించాలంటే లక్షణాలను వీలైనంత తొందరగా గుర్తించడం ముఖ్యం.జ్ఞాపకశక్తి లోపం: డైలీ లైఫ్‌ను ప్రభావితం చేసే జ్ఞాపకశక్తి లోపం అనేది ప్రధాన లక్షణం. ముఖ్యమైన తేదీలు, పేర్లు లేదా ఇటీవలి సంఘటనలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇది అప్పుడప్పుడు మర్చిపోవడం కాదు.. నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీంతో రోజువారీ పనులు, సంబంధాలు, బాధ్యతలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీటింగ్‌లు మర్చిపోవడం, ఒకే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడగడం జరుగుతుంటుంది. ప్లానింగ్ సమస్యలు: ప్లాన్ చేసుకోవడంలో, సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బడ్జెట్ ప్లాన్, వంట రెసిపీ గుర్తుంచుకోవడం, షెడ్యూల్ ప్రకారం నడచుకోవడం వంటి ఏకాగ్రత అవసరమైన పనులు కష్టంగా మారతాయి.

