Deceased Organs: మనిషి చనిపోయిన తర్వాత కూడా.. రోజంతా బతికి ఉండే అవయవం ఏదో తెలుస్తే మతిపోద్ధి!

ప్రతీ అవయవం చనిపోయాక ఎంతసేపు బతికి ఉంటుందనే దానికి ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ టైమ్ దాటిపోతే, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని మనం కోల్పోతాం. చనిపోవడం అంటే ఒకేసారి బాడీలోని అవయవాలన్నీ మరణించినట్టు కాదు. గుండె ఆగిపోయినా, మన శరీరంలోని చాలా భాగాలు కొంతసేపు బతికే ఉంటాయి. ఈ కాస్త సమయమే అవయవదానానికి (Organ donation) సరైన టైమ్. చనిపోయిన వ్యక్తి నుంచి ఆరోగ్యంగా ఉన్న అవయవాలను తీసి, ప్రాణాలతో పోరాడుతున్న మరొకరికి పెట్టడానికి డాక్టర్లకు ఈ సమయం చాలా ముఖ్యం. కానీ, ఇక్కడ టైమ్ చాలా విలువైంది. ప్రతీ అవయవం చనిపోయాక ఎంతసేపు బతికి ఉంటుందనే దానికి ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ టైమ్ దాటిపోతే, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని మనం కోల్పోతాం.
ఏ ఆర్గాన్ ఎంతసేపు బతికి ఉంటుంది?
అన్ని అవయవాలు ఒకేసారి పనిచేయడం ఆపవు. కొన్ని నిమిషాల్లోనే పనిచేయడం ఆపేస్తే, మరికొన్నింటిని సరైన పద్ధతిలో భద్రపరిస్తే గంటలు, రోజుల పాటు బతికే ఉంటాయి.అన్నిటికన్నా ఫాస్ట్‌గా చనిపోయేది మెదడే (Brain). ఆక్సిజన్ అందకపోతే 3 నుంచి 7 నిమిషాల కన్నా ఎక్కువ బతకలేదు. మరణంతో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కానీ, సరైన పద్ధతిలో చల్లబరిచి, మెషీన్లతో దాన్ని 4 నుంచి 6 గంటల వరకు పాడవ్వకుండా కాపాడవచ్చు. తద్వారా అది దానానికి పనికొస్తుంది.
ఊపిరితిత్తులు (Lungs) చాలా సెన్సిటివ్. అయినా కూడా 4 నుంచి 8 గంటల వరకు బతికే ఉంటాయి. కాలేయం (Liver)కి మరికాస్త ఎక్కువ టైమ్ ఉంటుంది. దాదాపు 8 నుంచి 12 గంటల వరకు పనిచేస్తుంది. ప్రధాన అవయవాల్లో కిడ్నీలే (Kidneys) చాలా స్ట్రాంగ్.
ఏకంగా 24 నుంచి 36 గంటల వరకు పనిచేస్తాయి. దీనివల్ల అవయవం అవసరం ఉన్న సరైన వ్యక్తిని వెతకడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. చర్మం, కార్నియాలు, కండరాలు ఇంకా ఎక్కువ కాలం ఉంటాయి. చర్మాన్ని 24 గంటల్లోపు, కంటి కార్నియాలను కొన్ని వారాల వరకు కూడా దానం చేయవచ్చు.
ప్రతి నిమిషం ఇంపార్టెంట్
అవయవాలకు ఆక్సిజన్ అందడం ఆగిపోగానే, అవి చనిపోవడం మొదలవుతాయి. ఈ ప్రాసెస్‌ను ‘ఇస్కీమియా’ (Ischemia) అంటారు. దీన్ని స్లో చేయడానికి, డాక్టర్లు వెంటనే స్పెషల్ లిక్విడ్స్, ఐస్‌తో అవయవాలను చల్లబరుస్తారు.కొన్నిసార్లు, గుండె, కాలేయం వంటివాటికి మెషీన్ల ద్వారా రక్తాన్ని, ఆక్సిజన్‌ను అందిస్తూనే ఉంటారు. దీనివల్ల అవయవాలు ఎక్కువ సేపు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, వ్యక్తి ఎలా చనిపోయారు, వాళ్ల వయసు, ఆరోగ్యం, అవయవాలను ఎంత ఫాస్ట్‌గా తీసి, తరలించారు అనే విషయాలపై కూడా ఈ టైమ్ ఆధారపడి ఉంటుంది. మరణం తర్వాత..
చనిపోయిన మొదటి గంటలో చర్మం పాలిపోతుంది, కండరాలు బిగుసుకుపోతాయి, రక్తం శరీరం కింది భాగాలకు చేరుతుంది. ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లో శరీరం కుళ్లిపోవడం మొదలవుతుంది. కానీ మూలకణాలు (Stem Cells) వంటి కొన్ని కణాలు కొన్ని రోజుల వరకు బతికే ఉంటాయి. ఈ అద్భుతమైన దశను ‘మరణపు సంధ్య’ (Twilight of Death) అని పిలుస్తారు. అంటే, మనిషి చనిపోయినా శరీరంలోని కొన్ని భాగాలు యాక్టివ్‌గా ఉండే చిన్న సమయం.ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్
అవయవాలు బతికి ఉన్నప్పుడే వాటిని శరీరం నుంచి తీయగలరు. అందుకే అవయవదానాలు ఎక్కువగా హాస్పిటల్స్‌లోనే జరుగుతాయి. అక్కడ ‘బ్రెయిన్ డెత్’ అయినా కూడా, లైఫ్ సపోర్ట్ మెషీన్ల ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందుతూ ఉంటుంది.ఒకవేళ వ్యక్తి హాస్పిటల్ బయట చనిపోతే, అవయవాలు వేగంగా పాడైపోతాయి కాబట్టి వాటిని దానం చేయడానికి వీలుండదు. శరీరం నుంచి తీసిన అవయవాలను వెంటనే అవసరం ఉన్నవారికి చేర్చాలి. దీనికోసం UNOS (United Network for Organ Sharing) లాంటి దేశవ్యాప్తంగా పనిచేసే నెట్వర్క్స్ ఉంటాయి. ఇవి అవసరాన్ని, మ్యాచింగ్‌ను, దూరాన్ని బట్టి దాతలను, స్వీకర్తలను వేగంగా కలుపుతాయి.

ఒక్క దాత, 8 కొత్త జీవితాలు
ఒక్క అవయవదాత ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలరు. కానీ, ఇదంతా చనిపోయిన తర్వాత ఉండే ఆ కొద్ది సమయంలోనే జరగాలి. ఏ అవయవం ఎంతసేపు బతికుంటుందో తెలుసుకోవడం వల్ల డాక్టర్లు వేగంగా స్పందించి, మరణం నుంచి కొత్త జీవితానికి దారి చూపగలుగుతారు.

