Couple robbed of necklace in gold shop

అక్కడ కొన్ని ఆభరణాలను చూస్తున్న సమయంలో ఓ నెక్లెస్‌ను మహిళ ఎవరికీ అనుమానం రాకుండా తన చీర కొంగు కింది భాగంలో దాచేసింది. అనంతరం షాపింగ్‌ ముగించుకొని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, స్టాక్‌ తనిఖీల సమయంలో ఆరు గ్రాముల బంగారం తగ్గినట్లు యజమాని గుర్తించాడు. దీంతో దుకాణం యజమాని గౌరవ్‌ పండిట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన నెక్లెస్‌ విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. అందులో ఓ మహిళ నెక్లెస్‌ దోచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. వారి కోసం గాలింపు చేపట్టారు. వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామన్నారు.







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *