కలియుగ ఇలవైకుంఠమైన తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
కలియుగ ఇలవైకుంఠమైన తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తుండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
SSD/DD టోకెన్లు ఉన్న భక్తులకు సుమారు 3-5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (మంగళవారం) స్వామివారిని 73,788 మంది భక్తులు దర్శించుకోగా.. 23,449 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు సమకూరింది.

