Cold Water: కూల్ వాటర్ తాగడం మంచిదేనా? ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ld Water: కూల్ వాటర్ (Cool Water) తాగడం వల్ల లాభ, నష్టాలపై ఎప్పుడూ డిబేట్ జరుగుతుంది. చల్లని నీరు తాగొద్దని కొందరు, తాగితే ఏ ప్రాబ్లమ్ ఉండదని మరికొందరు చెబుతారు. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. Cold Water: కొంతమంది సీజన్‌తో సంబంధం లేకుండా ఫ్రిజ్ వాటర్ తాగుతారు. అయితే కూల్ వాటర్ (Cool Water) తాగడం వల్ల లాభ, నష్టాలపై ఎప్పుడూ డిబేట్ జరుగుతుంది. చల్లని నీరు తాగొద్దని కొందరు, తాగితే ఏ ప్రాబ్లమ్ ఉండదని మరికొందరు చెబుతారు. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
కూల్ వాటర్ హెల్త్ రిస్క్
కూల్ వాటర్ తాగడం వల్ల శరీరంపై ఊహించని ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 1978లో విడుదలైన ఓ అధ్యయనం ప్రకారం.. 15 మందిపై జరిపిన పరిశీలనలో కూల్ వాటర్ తాగిన వారి ముక్కులో మ్యూకస్ మందం పెరిగిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. మరోవైపు, వేడి నీరు, చికెన్ సూప్‌ని తాగిన వారిలో మ్యూకస్ మందం తగ్గిపోయి శ్వాస తీసుకోవడం సులువైంది. అంటే, రోజూ కూల్ వాటర్ తాగే వారికి శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏవైనా అనారోగ్యాలు ఉన్నవారు కూల్ వాటర్ తాగితే, సమస్య మరింత తీవ్రమైందని మరో అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా, మైగ్రేన్ ముప్పు ఉన్నవారు ఫ్రిజ్ వాటర్ తాగితే, వ్యాధి తీవ్రత పెరుగుతుందని 2001లో వెల్లడైన అధ్యయనం తెలిపింది. దీంతో పాటు అన్నవాహిక నుంచి ఆహారం త్వరగా జారకుండా అడ్డుకుంటుందట.చైనీస్ సంప్రదాయ వైద్యంలో.. వేడి ఆహారాన్ని తినేటప్పుడు కూల్ వాటర్ తాగడాన్ని ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ బ్యాలెన్స్ తప్పిపోతుందని వారి విశ్వాసం. అందుకే, వేడి ఆహారానికి తోడుగా వేడి లేదా గోరువెచ్చని నీటిని తాగడాన్ని ఇది సూచిస్తోంది. మరికొన్ని సంప్రదాయాల్లోనూ ఈ పద్ధతి ఉంది. వేడి ఉష్ణోగ్రతల్లో కూల్ వాటర్ తాగడం కూలింగ్ రిలీఫ్‌ని అందించదట. అయితే, వీటిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉంది.వీరికి సమస్యే
సున్నితమైన జీర్ణ వ్యవస్థ, సెన్సిటివ్ దంతాలు కలిగిన వారికి కూల్ వాటర్ మరింత నొప్పి కలిగిస్తుంది. వీరు చల్లని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ మరింత బలహీనం అవుతుంది. శరీరంలోకి కూల్ వాటర్ వెళ్లాక అది రక్త నాళాలను కుచించుకుపోయేలా చేసి జీర్ణప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. మరికొందరిలో మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడి తలనొప్పి వస్తుంది. జలుబు, ఫ్లూ సమస్యతో బాధపడే వారిని సైతం కూల్‌వాటర్ మరింత ఇబ్బందికి గురిచేస్తుంది.

