Cockroach: Are cockroaches multiplying in your house? If you follow these tricks, they will disappear!

Cockroach దోమలు, చీమలతో పాటు బొద్దింకల సమస్య ఎక్కువవుతుంటుంది. వీటి సంఖ్య పెరిగి ఇంట్లో తిరుగుతుంటే చిరాకుగా అనిపిస్తుంది. కొందరైతే వీటిని చూసి భయపడతారు. ముఖ్యంగా కిచెన్, బెడ్​రూమ్, బాత్​రూమ్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇళ్లంతా తిరుగుతూ చికాకు పెట్టిస్తుంటాయి. ఇంట్లో బొద్దింకల నివారణ..

చాలా మంది ఇళ్లల్లో బొద్దింకల సమస్య చాలా ఉంటుంది. ప్రతి ఇళ్లల్లో బొద్దింకల బెడదతో ఇబ్బందులు పడుతుంటారు. బొద్దింకల సమస్యలను పరిష్కరించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఫలితం ఉండదు. ఒక్క బొద్దింకతో వేల బొద్దింకలు తయారు అవుతాయి. ఇది ప్రతి ఇళ్లల్లో ఉండే సమస్య. బొద్దింకలను లేకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. అయితే ఈ బొద్దింకల సమస్య కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కిచెన్, బెడ్​రూమ్, బాత్​రూమ్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇళ్లంతా తిరుగుతూ చికాకు పెట్టిస్తుంటాయి. కొన్ని చిట్కాలతో సులభంగా వీటిని ఇంటి నుంచి తరిమి కొట్టొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

బొద్దింకలకు దీని నుంచి వచ్చే ఘాటైన వాసన అలెర్జిక్ రియాక్షన్ ఇస్తుంది. అందుకే దాల్చినచెక్క పౌడర్‌ను చేసుకుని అందులో ఉప్పు కలిపి అవి తిరిగే ప్రదేశాలలో చల్లండి. ఇది చేస్తే బొద్దికలు అస్సలు రావంటున్నారు నిపుణులు. అంతేకాదు వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఉల్లి: ఉల్లిపాయల నుంచి ఘాటైన వాస కూడా బొద్దింకలకు అస్సలు నచ్చదు. దాని వాసనకు పారిపోతాయి. అందుకే ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రాంతాలలో కొద్దిగా ఉల్లిపాయ రసం స్ప్రే చేయండి. ఫలితంగా అవి ఇంట్లో నుంచి ఈజీగా పారిపోతాయంటున్నారు.

లవంగం: లవంగాల వాసన కూడా బొద్దింకలకు అస్సడు పవదు. ఇంట్లో బొద్దింకలు పారిపోయేందుకు లవంగాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ఇంట్లో బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో లవంగాలను ఉంచితే పారిపోతాయట.

బేకింగ్ సోడా, చక్కెర: ఈ రెండు పదార్థాలు కూడా బొద్దింకలను పారిపోయేందుకు ఉపయోగపడతాయి. సమాన పరిమాణంలో బొద్దింకలు ఉన్న ప్రాంతంలో చల్లడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటున్నారు. ఎందుకంటే ఇవి తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయట. అప్పుడు వాటిని తీసి బయటపడేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. (నోట్‌: ఇందులోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే అందిస్తున్నాము.)



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *