Chittoor Gang-Rape | గ్యాంగ్ రేప్ నిందితులు అరెస్ట్ .. పోలీసుల సంచలన నిజాలు

చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీనా జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ లను గుడిపల్లె దగ్గర అరెస్ట్ చేశారు. అయితే, ఈ ముగ్గురు నిందితులు ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే, వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగదు తీసుకుని వేధించేవారు.. అలా గత సెప్టెంబర్ 25వ తేదీనా ఓ ప్రేమ జంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
