తన తదుపరి చిత్రానికి మరింత భారీ సెటప్ తో రాబోతున్నారు చిరంజీవి. బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చిరు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం కృతి శెట్టిని తీసుకున్నారు.
చిరంజీవి-కృతి శెట్టి కాంబినేషన్ ఏంటని ఆలోచిస్తున్నారా? కూతురు సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా కృతి శెట్టి కనిపించనుంది. తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోయిన్, ఇప్పుడిలా ఓ కీలక పాత్రకు ఓకే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ ను జల్లెడ పట్టే పనిలో ఉన్నాడు బాబి. నయనతార, తమన్న లాంటి వాళ్లను కూడా. రవీనా టాండన్ లాంటి సీనియర్ నటిని ప్రాజెక్టులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు.
ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఇప్పటికే మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా భారీ సెటప్ తో చిరంజీవితో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు డైరక్టర్ బాబి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

