Check your fatty liver problem with this drink..! You will be amazed at the magic that happens in your body..!

రాష్ట్ర వార్త :

కాలేయం ఆరోగ్యానికి ఈ డిటాక్స్ డ్రింక్ ఒక సహజ పరిష్కారం. ఫ్యాటీ లివర్, పేరుకున్న కొవ్వు, వ్యర్థాలు తొలగించడానికి ఇది సహాయపడుతుంది. ఉసిరికాయ, అలోవెరా, కొత్తిమీర, పసుపు కలిపి తయారు చేసిన ఈ డ్రింక్ జీర్ణక్రియ, రక్తనాళాల్లో కొవ్వు నిలకడను మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డిటాక్స్ డ్రింక్ ప్రయత్నించండి. దీన్ని తాగితే కాలేయంలో పేరుకున్న కొవ్వు, వ్యర్థాలు తొలగిపోతాయి. ప్రస్తుతం చాలా మందికి ఉన్న ఫ్యాటీ లివర్ సమస్యకు ఇది ఒక మంచి పరిష్కారం. కాలేయ ఆరోగ్యానికి ఉసిరికాయ చాలా మేలు చేస్తుంది. ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్ డిటాక్స్ డ్రింక్

ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవడానికి ముందుగా గింజలు తీసిన ఉసిరికాయ ముక్కలను మిక్సీలో వేయాలి. ఆ తర్వాత అలోవెరా జెల్, కొత్తిమీర, నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టుకుని చివరిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపితే మీ ఆరోగ్యకరమైన డ్రింక్ సిద్ధం.

ఎప్పుడు తాగాలి..?

ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక గంట ముందు లేదా భోజనం చేసిన ఒక గంట తర్వాత ఈ జ్యూస్‌ను తాగాలి. ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకూడదు. మంచి ఫలితం కోసం వరుసగా మూడు రోజుల పాటు తాగండి. ఈ మూడు రోజులు మద్యం, సిగరెట్లు, నూనె పదార్థాలు తినకూడదు.

డ్రింక్ వల్ల కలిగే లాభాలు

  • ఉసిరికాయ.. కాలేయంలో పేరుకున్న వ్యర్థాలను, కొవ్వును బయటకు పంపుతుంది.
  • అలోవెరా.. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి.
  • కొత్తిమీర.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.
  • పసుపు.. కాలేయంలోని కొవ్వును తొలగించి.. శుభ్రంగా ఉంచుతుంది.


		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *