ఇలాంటి స్నేహితుడు పక్కలో బల్లెం వంటి వాడు.. శత్రువు కంటే డేంజర్

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. రాజనీతివేత్త , తత్వవేత్త. మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొంటూ నీతి శాస్త్రం రచించాడు. ఇందులో చెప్పిన విషయాలు మనిషి జీవితం సుఖవంతంగా సాగిపోవడానికి నేటికీ అనుసరణీయం. చాణక్యుడు మానవ సంబంధాల గురించి కూడా ప్రవస్తావించాడు. అందులో ఒకటి స్నేహం గురించి… ఎవరితో స్నేహం చేయాలి? ఎవరికీ దూరంగా ఉండాలని కూడా వివరించాడు.
స్నేహానికన్న మిన్న ఈ లోకాన లేదురా అన్నాడో సినీ కవి. అవును స్నేహం అనేది ఎంతో అందమైన బంధం. నిజమైన స్నేహితుడు జీవితంలో ఒక్కడున్నా చాలు.. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఏమీ చేయవని అంటూ. అయితే స్నేహితులను ఎంచుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిజమైన స్నేహితులు ఎంత మంచి చేస్తారో.. స్నేహం నటించేవారు అంతకంటే చెడు చేస్తారు. స్నేహం నటించే వ్యక్తి.. శత్రువుకంటే ప్రమాదకరం. వీరు ఊసరవెల్లిలా సమయానికి అనుగుణంగా తమ రంగుని మార్చుకుంటారు. అవసరం అనుకుంటే మీకు హాని చేయడానికి కూడా వెనుకాడరు. కనుక స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఈ రోజు స్నేహం ముసుగులో చెడు చేసే వ్యక్తుల లక్షణాలు తెలుసుకుందాం..
మీరు మంచిగా ఉన్నప్పుడు.. మంచి సమయం సాగుతున్నప్పుడు.. మీ వెంట వెంట ఉండి.. కష్టాలు ఎదురైతే.. వెంటనే విడిచి పెట్టి వెళ్ళిపోయేవాడు ఎన్నడూ నమ్మదగిన స్నేహితుడు కాలేడని చాణక్య చెప్పాడు. సుఖ సంతోషాల్లో మాత్రమే కాదు.. కష్టనష్టాల్లో కూడా తోడునీడ నిలిచేవాడు నిజమైన స్నేహితుడని చాణక్యుడు చెప్పాడు.
పైకి మంచిగా , నవ్వుతూ కనిపించినా… లోలోపల మీ పట్ల అసూయపడే వ్యక్తులు స్నేహం అత్యంత ప్రమాదం. మే అభివృద్ధిని , పురోగతిని చూసి అసూయ పడేవారే మీ నాశనానికి వీరే కారణం. నీ బలహీనతలను తెలుసుకుని ఇతరుల ముందు మిమ్మల్ని కించ పరిచేలా మాట్లాడుతూ.. మీ ప్రతిష్టను దెబ్బతీస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పుకుని తిరుగుతారు. సంతోష పడతారు.
అందుకనే శత్రువు ఐతే నేరుగా దాడి చేస్తాడు.. కానీ స్నేహం మాటున దాగి ఉండే శత్రువు.. మీతో ఉండూ మీ వెనుక గోతులు తీస్తూ.. మీ నాశనాన్ని కోరుకుంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ ప్రమాదకరం. కనుక చెడు స్నేహితులు ఎలా ఉంటాడో తెలుసుకుందాం..
మీరు ఏదైనా పనిలో విజయం సాధిస్తే.. దానిని చూసి అసూయతో రగిలి పోయేవారు
తప్పులు చేస్తే వాటిని మీకు చెప్పి సరిదిద్దడానికి బదులుగా.. ఆ తప్పులను పది మంది ముందు ప్రస్తావిస్తూ ఎత్తి చూపించి ఎగతాళి చేసేవాడు.
మీ రహస్యాలను, మీ బలహీనతలను.. తనలో దాచుకోకుండా.. అందరికీ చెప్పి వినోదం పొందేవాడు
మీ పరిస్థితి బాగోలేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తనకు పట్టనల్టు పక్కకు తప్పుకునేవాడు
మీ ముందు మంచిగా మాట్లాడుతూ… మీ వెనుక మీ గురించి చెడ్డగా చెప్పేవాడు. ఇలాంటి లక్షణాలు అన్నీ చెడు స్నేహితులవే..
కనుక ఎప్పుడూ మీ మేలు కోరే స్నేహితులనే ఎంచుకోండి. స్వార్థపరులకు వీలైంత దూరంగా ఉండమని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

