దారుణం.. 18 ఏళ్ల ఆంధ్ర యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం..

యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను బలవంతంగా వాహనం నుంచి దించారు. తరువాత సమీపంలోని ఒక తోటలోకి లాక్కెళ్లి, ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కపై సోదరి కళ్లముందే అత్యాచారానికి పాల్పడ్డారు.Crime News: తమకు రక్షణ కల్పించాల్సిన వారే దారుణానికి పాల్పడటంతో తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

