Bitcoin Price: దూసుకుపోతున్న బిట్ కాయిన్.. చరిత్రలో తొలిసారి.. ఎంతకు చేరిందో తెలుసా?

Bitcoin Price: బిట్‌కాయిన్ 2025లో $111,988.90 స్థాయిని తాకి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం $111,259 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Bitcoin Price: ప్రపంచపు ప్రముఖ డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్, 2025లో మరోసారి తన గరిష్ఠస్థాయిని అధిగమించింది. బుధవారం నాడు ఇది $111,988.90 స్థాయిని తాకి చరిత్ర సృష్టించింది. భారత రూపాయల విలువలో ఇది దాదాపుగా రూ.93 లక్షలు. అంతేకాకుండా, ఇది ప్రస్తుతం $111,259 వద్ద ట్రేడ్ అవుతుండగా, గత 24 గంటల్లో 0.4 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బిట్‌కాయిన్ మొత్తం 18 శాతానికి పైగా పెరిగింది. ఇది ఈ సంవత్సరం అత్యంత లాభదాయకంగా మారిన అసెట్లలో ఒకటిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో, ముఖ్యంగా సంస్థాగత మదుపుదారుల్లో బిట్‌కాయిన్‌పై నమ్మకం పెరగడం, దీని విలువను గణనీయంగా పెంచుతోంది.
బిట్‌కాయిన్ ర్యాలీకి కారణాలు..
ఈ ర్యాలీకి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు చేసే అవకాశాలు, అలాగే అమెరికన్ డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా మదుపుదారుల రిస్క్ తీసుకునే ధోరణిలో పెరుగుదల వంటి అంశాలు బిట్‌కాయిన్ ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. ఈ ర్యాలీ వెనుక మరొక ముఖ్యమైన అంశం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు వంటి పెద్ద పెట్టుబడిదారుల నుంచి డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడి పెట్టే ధైర్యం పెరగడం. గతంలో రిస్కీగా భావించిన బిట్‌కాయిన్ ఇప్పుడు ధృవీకృత మార్కెట్ క్యాప్ కారణంగా నమ్మదగిన ఆస్తిగా మారుతోంది.ప్రొఫెషనల్ క్యాపిటల్ మేనేజ్మెంట్ CEO ఆంథనీ పోంప్లియానో ప్రకారం, బిట్‌కాయిన్‌కు ఉన్న విశ్వసనీయత దానివల్లే పెరుగుతోందన్నారు. “ఇది ఏకైక అసెట్, ఇది పరిమాణంలో పెరిగేకొద్దీ రిస్క్ తగ్గుతుంది,” అని ఆయన వివరించారు. ఇప్పటికే బిట్‌కాయిన్ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూను అధిగమించడంతో, పెద్ద పెట్టుబడిదారులు దానిని ఒక అసలైన లాంగ్‌టెర్మ్ అసెట్‌గా పరిగణిస్తున్నారు. దీని వలన మరింత మంది సంస్థాగత మదుపుదారులు మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. గతంలో క్రిప్టోను దూరంగా ఉంచిన కంపెనీలు ఇప్పుడు వాటిని వారి పోర్ట్‌ఫోలియోలో చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయ్.

