బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. అందరూ ఆ కంటెస్టెంట్‌కే స్పాట్ పెట్టారుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారానికి వచ్చేసింది. ఎప్పటిలాగే నామినేషన్స్ లో రచ్చ రచ్చ జరిగింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకున్నారు. మొదటి వారంలో 9 మంది నామినేట్ అయితే రెండో వారంలోనూ ఏకంగా ఏడు మంది నామినేషన్స్ లో నిలిచారు.
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ అప్పుడే వారం పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9లోకి 9మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ కలిపి మొత్తం 15 మంది ఇంట్లోకి అడుగు పెట్టారు. అయితే గేమ్స్, టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపిని శ్రేష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక హౌస్ లో రెండో వారం నామినేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిని ఎంచుకుని వారికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో ముందుగా తనూజ మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత మర్యాద మనీష్ రితూ చౌదరిని నామినేట్ చేశాడు. అలాగే భరణి కూడా ఈ లిస్టులో చేరాడు. ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ ఎక్కువగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం గమనార్హం. మొత్తానికి రెండో వారం నామినేషన్స్ లిస్టులో హరీష్, భరణి, మనీష్ మర్యాద, ప్రియ, డీమన్ పవన్, ఫ్లోరా షైనీ ఉన్నారు. మరి వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళతారో చూడాలి.
కాగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ విపరీత ప్రవర్తనతో కంటెస్టెంట్స్ కు విసుగొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పనిగట్టుకుని మరీ అతనిని నామినేట్ చేస్తున్నాడు. అంతకు ముందు హోస్ట్ నాగార్జున్ కూడా హరీశ్ కు గట్టిగానే క్లాస్ పీకాడు. అయినా మాస్క్ మ్యాన్ మాత్రం మారడం లేదు. పైగా ఇప్పుడు హౌస్ లో నిరహార దీక్ష కూడా చేపట్టాడు. అయితే బయట మాత్రం ఈ మాస్క్ మ్యాన్ కు భారీగా మద్దతు లభిస్తోంది. అతనికి ఎక్కువ శాతం ఓట్లు పడుతున్నాయి. మరి ఈ లెక్కన చూసుకుంటే రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

