అపర భగీరధుడు

భగీరధుడు గంగను భువికి తీసుకు వచ్చిన మహాముని. హిందూ సాహిత్యంలో ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన పురాణ రాజు. హిందూ నది దేవత గంగాగా వ్యక్తీకరించబడిన పవిత్రమైన గంగానదిని స్వర్గం నుండి భూమిపైకి తపస్సు చేయడం ద్వారా తీసుకువచ్చిన పురాణానికి అతను బాగా పేరు పొందాడు.సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు దిలీపుడు. అతని కుమారుడు భగీరధుడు.
పురాణ కథనం

భగీరథ ప్రయత్నం
సూర్యవంశపు రాజైన సగరునకు కేశిని, సుమతి అను ఇద్దరు భార్యలు. కేశినికి అసమంజసుడను ఒక కుమారుడు, సుమతికి 60 వేల మంది కుమారులు కలిగారు.
భగీరథుని ముత్తాత అయిన సగర రాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు. అయితే ఆ యాగం అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి, పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో దేవత జంతువును నిర్బంధిస్తాడు. సగరుని 60,000 మంది కుమారులు పాతాళంలో నిర్బందించి ఉన్న గుర్రాన్ని కనుగొంటారు, అప్పుడు వారు తమ బొంగురు శబ్దాలతో కపిలమహర్షిని కలవరపరుస్తారు. కోపోద్రిక్తుడైన కపిలమహర్షిని సగరుని 60,000 మంది కుమారులు, ఋషి అగ్ని నేత్రాలచే బూడిదగా మారతారు.వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. అది పొందేవరకు సగరుని కుమారుల అంత్యక్రియలను నిర్వహించే బాధ్యత తరతరాలుగా సంక్రమించింది.
భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తరువాత, తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని, గంగా దేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. భగీరథుడు దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమై, స్వర్గం నుండి భూమికి దిగితే, తన దూకుడు శక్తిని నిలబెట్టుకోవడం కష్టమని, దానిని తట్టుకోవాలంటే జడలుకట్టిన జుట్టు, నీల కంఠం ఉన్న శివుడు మాత్రమే దానికి నిలబడశక్తి ఉందని, అందువలన శివుని అనుగ్రహం పొందమని గంగ భగీరథుడికి చెప్పింది.
భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, “జాహ్నవి” అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.<
భగీరథ ప్రయత్నం
ఈ పురాణ కథన ఆధారంగా భగీరథ ప్రయత్నం అనే మాట వాడుకలోకి వచ్చింది. అతని కృషికి గుర్తుగా, దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో కలిసే వరకు నది ప్రధాన ప్రవాహాన్ని స్థానికులు భాగీరథి అని పిలుస్తారు. పాతాళం వైపు ప్రవహిస్తున్నప్పుడు, గంగ జహ్నవి మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. దేవత అహంకారాన్ని శిక్షించడానికి, ఋషి నదిని మింగేశాడు. భగీరథుని పట్టుదలతో కూడిన విన్నపంతో, ఋషి తన చెవి ద్వారా నదిని బయటకు నెట్టడానికి సమ్మతిస్తాడు. ఇది దేవతకు జాహ్నవి నది అనే పేరును తెచ్చి పెట్టింది.

News by : V.L
