Best EV: These electric scooters can be driven without a driving license!

సాధారణంగా స్కూటర్ లేదా బైక్ నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు నడిపేందుకు లైసెన్స్ కూడా అవసరం లేదని మీకు తెలుసా? అవును, తక్కువ స్పీడ్ తో వెళ్లే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు నడపడానికి ఎలాంటి పరిమితులు ఉండవు. లైసెన్స్ లేనివాళ్లు కూడా వాటిని డ్రైవ్ చేయొచ్చు. అలాంటి కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో ఈవీ కంపెనీలు కూడా రకరకాల మోడళ్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి.  తక్కువ మోటర్ కెపాసిటీ, తక్కువ స్పీడ్ తో నడిచే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను లైసెన్స్ లేకుండానే నడపొచ్చు. స్టూడెంట్స్, హౌజ్ వైవ్స్, సీనియర్ సిటిజెన్స్ కు ఈ స్కూటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో కొన్ని బెస్ట్ మోడల్స్ ఇప్పుడు చూద్దాం.ఓలా గిగ్ (Ola Gig)

ఒకటిన్నర్ కిలో వాట్ బ్యాటరీ సామర్ధ్యంతో నడిచే ఓలా గిగ్ స్కూటర్ గంటకు 24 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ కు  112 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్, ఎల్ ఈడీ హెడ్ లైట్, డిజిటల్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 35 వేలు ఉంటుంది.

ఆంపియర్ రియో 80 (Ampere Reo 80)

ఆంపియర్ రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.44 కిలో వాట్ బ్యాటరీ సామర్ధ్యంతో నడిచే మోటర్ ఉంటుంది.  దీని టాప్ స్పీడ్ గంటకు సుమారు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే నడిపుకోవచ్చు. ఇది సింగిల్ ఛార్జ్ కు 50 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.  ధర సుమారు రూ.59,900గా ఉంది.హీరో ఎలక్ట్రిక్ ఆట్రియా ఎల్ ఎక్స్ (Hero Electric Atria LX)

అడ్వాన్స్ డ్ ఫీచర్లతో వచ్చే ఈ స్కూటర్ లో ఫుల్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజ్ కంట్రోల్,  వాక్ అసిస్టెంట్, టెలీస్కోపిక్ ఫోర్క్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీతో నడిచే మోటర్ ఉంటుంది.  దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. సింగిల్  ఛార్జ్ కు 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ధర సుమారు రూ. 77,690 ఉంటుంది.

కైనెటిక్ గ్రీన్ జింగ్ (Kinetic Green Zing)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మంచి డిజైన్, స్మార్ట్ ఫీచర్ల తో వస్తుంది. ఇందులో 1.4 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఇది 70 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. స్మార్ట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్యూబ్‌లెస్ టైర్లు, USB చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లున్నాయి. ధర సుమారు రూ. 67,990 ఉంటుంది.




		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *