Bathroom Bad Smell: మీ బాత్ రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తోందా.. ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్య దూరం!

Bathroom Bad Smell: మీ బాత్ రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తోందా.. ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్య దూరం!బాత్ రూమ్ నుంచి దుర్వాసన రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా ఆ చెడు వాసన పోకపోతే, అది మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఈ సమస్యకు కొన్ని సులభమైన పరిష్కారాలు, చిట్కాలు ఉన్నాయి. ఈ క్రేజీ చిట్కాలు పాటిస్తే మీ బాత్ రూమ్ నుంచి ఆ సమస్య దూరం అవుతుంది.బాత్ రూమ్ బ్యాడ్ స్మెల్ ని దూరం చేసే టిప్స్ 1. డ్రైనేజీ పైపులు శుభ్రం చాలాసార్లు డ్రైనేజీ పైపుల్లో వెంట్రుకలు, సబ్బు మురికి పేరుకుపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. ఈ సమస్యకు బేకింగ్ సోడా, వెనిగర్ అద్భుతంగా పనిచేస్తాయి. ముందుగా డ్రైనేజీ పైపుల్లో అర కప్పు బేకింగ్ సోడా వేయండి.వెంటనే ఒక కప్పు వెనిగర్ పోయండి.20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత వేడి నీళ్ళు పోసి శుభ్రం చేయండి. ఇది పైపుల్లో పేరుకున్న మురికిని తొలగిస్తుంది. 2. బ్లీచింగ్ పౌడర్ ఉపయోగం బాత్ రూమ్ ఫ్లోర్ నుంచి వాసన వస్తుంటే, శుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ (Bleaching Powder) వాడండి. ఒక బకెట్‌లో నీరు తీసుకొని కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కలపండి. ఆ నీటితో ఫ్లోర్, గోడలు శుభ్రం చేయండి. బ్లీచింగ్ పౌడర్ బాక్టీరియాను చంపుతుంది. ఫ్లోర్ మీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది.3. వెంటిలేషన్ ముఖ్యం బాత్ రూమ్ లో గాలి సరిగా ఆడని పక్షంలో అక్కడ తేమ ఎక్కువ అవుతుంది. తేమ ఉంటే ఫంగస్, బాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. అందుకే బాత్ రూమ్ కిటికీని, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఎక్కువసేపు తెరిచి ఉంచాలి. గాలి ప్రసరణ బాగా జరిగేలా చూడాలి.4. నిమ్మ, ఉప్పు ట్రిక్ సులభంగా సువాసన రావాలంటే, ఒక నిమ్మకాయను సగానికి కట్ చేయండి. అందులో ఉప్పు నింపి బాత్ రూమ్ మూలలో ఉంచండి. ఉప్పు తేమను లాక్కుంటుంది. నిమ్మకాయ సువాసనను ఇస్తుంది. వారానికి ఒకసారి దీన్ని మార్చండి.5. వాసన పీల్చే వస్తువులు బాత్ రూమ్ లోని చెడు వాసనను పీల్చుకోవడానికి బేకింగ్ సోడా ఒక చిన్న గిన్నెలో ఉంచి ఓ మూల పెట్టండి. బేకింగ్ సోడా వాసనను పీల్చుకునే గుణం కలిగి ఉంది. అలాగే, ఎసెన్షియల్ ఆయిల్స్ (Essential Oils) కలిపిన డిఫ్యూజర్‌ను ఉపయోగించడం మంచిది.ఈ చిట్కాలు పాటిస్తే మీ బాత్ రూమ్ ఎప్పుడూ సువాసనతో ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులు కూడా మీ శుభ్రతను మెచ్చుకుంటారు.

